Monday, August 31, 2009

ఆనందం పిచ్చోడిని -3 (జవాబులు)

ఏమై ఉండేది?

బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
భారతదేశానికి తిండికి కరువు వచేది................

గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
ఫోన్ ని వేరేవాడు కనిపెట్టీ వుండేవాడు....................

బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
లెక్కలు చేయాల్సిన బాధ వుండేది కాదు..................

దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
ఆ తోకని కూడా అలంకరించుకోవాల్సివచ్చేది, ప్యాంటు ఇప్పుడున్నత్లు వుండేది కాదు..................

రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్  ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
అలా ఎలా అనుకుంటాడండీ, అది వర్కవుట్ కాదు కదా...................

గాంధీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
ఆయన కూడా భాభా, అదేనండీ భార్యా బాధితుడు అయి ఉండేవాడు....................

ఐన్ స్టీన్ E=mc^2  అని కాక e=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
అతనికి నోబేల్ బహుమతి వచ్చేది కాదు, ఆతర్వత వేరేవాడికి వచ్చేది......................

న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
న్యూటన్ తల పగిలేది......................

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-6 (నిరుద్యోగం)

 
మనకూ ఇలాంటి నాయకుడే ఉండాల్సింది.................1947 కి ముందు
నిరుద్యోగం మన దేశానికున్న అతి ప్రధానమైన సమస్య............
దేశంలో కొన్ని లక్షల మంది పట్టబద్రులున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం లేవు.............
వీరంతా నిరుద్యోగులుగా ఎందుకున్నారు?
ప్రభుత్వశాఖల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వాలు వాటిని భర్తీ చేయవు,
ఆ ఉద్యోగాలన్నీ భర్తి చేసినా ఇంకా నిరుద్యోగులు మిగిలేఉంటారు, కానీ నిరుద్యోగం ఒక సమస్య అని భావించి దాని రూపుమాపాలని ఈ ప్రభుత్వాలు భావిస్తే చాలా సులభంగా ఆ పనిని చేయవచ్చు............
అలాగని వాటిని భర్తీ చేయకపోవడాన్ని కానీ, నిధులు లేక భర్తీ చేయట్లేదనే కుంటి సాకుని గానీ సమర్ధించలేం.......................
ఎందుకంటే మనదేశాంలో ఉపాధి అవకాసాలు మెండు, ప్రభుత్వం ఆ అవకాశాలు ప్రజలకు చేరే మార్గాన్ని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య నిర్మూలనే కాక, ప్రభుత్వానికి సైతం ఎంతో ఆదాయం చేకురుతుంది.......
అదెలాగ అంటే స్యయం ఉపాధి పథకాలు, కుటీర పరిశ్రమలు మొదలగు వాటిని ప్రోత్సహించడం ద్వారా, మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, రవాణా.......... వంటి వాటిని ప్రజలందరికీ అందేలా చూడడం,............
మనప్రభుత్వాలు ఇలాంటి చర్యలేమీ తీసుకోవట్లేదా అనే ప్రశ్నకు "తీసుకుంటున్నాయి" అనే సమాధానం చెప్పల్సివుంటుంది, ఎందుకంటే కాగితాల్లో లెక్కల ప్రకారం అవన్నీ జరుగుతున్నాయి, కానీ అవి ప్రభువులకు, వారి బంధువర్గానికీ............... ఆదాయ వనరులుగా ఉపయోగపడడానికే అన్నది అక్షరసత్యం..................
నిరుద్యోగాన్ని ఎందుకు రూపుమాపరు అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మళ్ళి నిన్న చెప్పుకున్న 
"కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం..........." అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే చక్కగా అర్ధం అవుతుంది..............
ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే, కానీ ఎప్పుడూ పెద్దగా ఆలోచించివుండం.......... అందుకే గుర్తుచేస్తున్నా.................
ఈ విషయంలో మనం ఏమీ చేయలేమా అంటే......................
చేయగలం.............
ఎలా?
మనకున్న సమస్యల్లో ప్రధానమైన రెండు సమస్యలు  విద్య, నిరుద్యోగం ల గురించి చర్చిచాం, ఇవేకాక ఇలాంటి ప్రధానమైన సమస్యలు మరికొన్ని వున్నాయి, ముందు అవి కూడా చర్చించేశాక, అప్పుడు అన్ని సమస్యలకూ కలిపి పరిష్కారాన్ని ఆలోచిద్ద్దాం............

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు  పెద్దలు.................

Sunday, August 30, 2009

ఏమై ఉండేది?

ఏమై ఉండేది?

బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
..............
గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
..................
బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
..................
దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
..................
రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్  ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
...................
గాంధీ మళ్లీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
...................
ఐన్ స్టీన్ E=mc^2  అని కాక E=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
....................
న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
.....................

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-5 (మన విద్యావిధానం)

 
చదువంటే ఇంత కష్టమా.............?

ప్రతి దేశంలోనూ విద్యావ్యవస్థను నడిపించడానికి విద్యాశాఖ, ఆశాఖకు కొన్ని నిధులు వున్నాయి కాబట్టి మనదేశంలో కూడా వున్నాయి.
స్కూళ్ళు, టీచర్లు, సిలబస్, పుస్థకాలు ఉండాలి కాబట్టి అవి కూడా వున్నాయి................
కానీ అక్కడికీ మనకీ ఒక తేడా............
పాలకులు......................
ప్రజలకు నిజమైన విఙ్నానం   చేరువైతే నాయకులను తన్ని తగలేస్తారు..............
వాళ్ళు విఙ్నులు  కావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య...........
అది వాళ్ళకు సరైన మార్గంలో చేరకూడదు...........
.......................
నాసిరకం విద్యావిధానాలు, వసతులు లేని పాఠశాలలు,...............
> లెక్కలంటే అంకెలు, సూత్రాలు, కూడికలు, తీసివేతలు వగైరా..............
> సాంఘిక శాస్త్రం అంటే మన నాయకుల పూర్వీకుల గొప్పతనాన్ని పొగిడేందుకు ఉద్దేశించబడిన, అందరూ చదవాల్సిన శాస్త్రం..............
> సైన్సు అంటే ప్రపంచంలో అందరూ చదువుతున్న్నరు కాబట్టి మనమూ చదవాల్సిన అంశం..... బట్టీ పట్టాల్సిన శాస్త్రం..............
> భాషలు నేర్చుకోకపోతే పై శాస్త్రాలు చదవలేరు కాబట్టి నేర్చుకోవాలి...........
.............. విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం మాత్రం సహజంగా పిల్లలకుండే ప్రశ్నించే తత్వాన్ని, అవగాహనాసామర్ధ్యాన్ని, పరిశీలనా శక్తిని సమూలంగా చంపివేసి వాటిస్థానే బట్టీ పట్టడం, బుర్ర సక్రమంగా పని చేయకుండా ఒకదానికొకటి సంబంధంలేని చెత్త విషయాలతో నింపేయడం.
దీనికి తగ్గట్టుగానే సిలబస్ లు తయారు చేశారు, పరీక్షావిధానం సైతం తదనుగుణంగానే తయారుచేయడం జరిగింది, పుస్తకంలో వున్నది వున్నట్టుగానే పరీక్షలో రాశారా లేదా అని పరీక్షిస్తారు...........
............
కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం...........
గత 62 సంవత్సరాలుగా ఈ తరహా విధానాలను చాలా ప్రణాళికాబద్దంగా, జాగ్రత్తగా అమలు చేస్తూవస్తున్న ప్రభువులకు నిజంగా హ్యట్సాఫ్........
 

Saturday, August 29, 2009

ఆనందం పిచ్చోడిని -2



మీకెపుడైనా నడిచేటపుడు సడెన్ గా.................
.
.
పరిగెత్తాలనిపించిందా?
.
.
.
అనిపిస్తే................. అప్పుడేం చేసారు?????????????
.
.

అలా ఎందుకు అనిపించిందో ఆలోచించారా?
.
.
.
సమాధానం దొరికిందా?
.
.
.
అలాంటి ఆలోచన మీకే ఎందుకు వచిందో ................
.
.
.
ఇంతకీ మీరు పరిగెత్తారా లేదా?.
.
.
.
పరిగెత్తితే, ఎంతదూరం పరిగెత్తారు?
.
.
అసలు ఆగారా లేదా?
.
.
ఆగితే ఎందుకు ఆగారు?
.
.
అదేనండీ............ అర్థం కాలేదా?
ఆగాలనిపించి ఆగారా లేక ఎవరైనా ఆపితే ఆగారా...............???
.
.
.
సరే పరిగెత్తలేదు అనుకుందాం.............
.
పరిగెత్తాలనిపించినా ఎందుకు పరిగెత్తలేదు...........
.
మికు పరిగెత్తడం రాదా?
ఎవరైనా ఏదైనా అనుకుంటారని అనిపించిందా? ఈగో అడ్డొచిందా?

లేక ................ సంకల్పబలం లేదా?
.
.
ఏంటండీ............... వీడికేమైనా పిచ్చి పట్టిందా.......... అని అనుకుంటున్నారా?

చెప్పా కదండీ.............

నేను ఆనందం పిచ్చోడిని.................
.
.
ఎవడి పిచ్చి వాడికి ఆనందం............
..
..
ఆనందం వస్తుందంటే ఏం చేసినా తప్పు లేదండీ.............
పరిగెత్తాలనిపిస్తే పరిగెత్తొచ్చు................
మనం బతికేదే ఆనందం కోసం...................
ఆనందో బ్రహ్మ...............

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-4(ఆక్షరాస్యత -2)


                        ఈ మహానుభావుడు కలలుగన్న స్వరాజ్యం ఎప్పుడు చూస్తామో.........................

ప్రైవేటు పాఠశాలలు:
.
.

గవర్నమెంటు స్కూళ్ళలో ఐతే ఏమి చెప్పరు, ఎంత ఖర్చు ఐనా ఫర్వాలేదు పిల్లల్ని ప్రైవేటు స్కూల్లోనే చదివించాలి అని భ్రమపదుతుంతారు చాలామంది..............
కానీ అక్కడ పరిస్థితి వేరు...........
పిల్లల్ని ఎంతసేపు స్కూల్లో ఉంచాము, రోజుకి ఎన్ని క్లాసులు తీసుకుంటున్నాము, పక్క స్కూల్లో కంటే మన ఐ.ఐ.టి. సిలబస్ బాగుందా లేదా..................
ఎక్కువ ఫీ వసూలు చేయడానికి ఇలాంటి చౌకబారు తెలివితేటల్ని ఉపయోగిస్తారే తప్ప.................
ఇలాంటి విషయాలకి ఇచ్చినంత ప్రాముఖ్యత పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా, వాళ్ళ .. కి ఈ సిలబస్ కరెక్టేనా కాదా, టీచర్లు చెప్పేది పిల్లలకి అర్థం అవుతుందా లేదా, తల్లిదండ్రులు వేలకి వేలు ఫీజులు కట్టి ఎందుకు జాయిన్ చేశారు?, మనం నాణ్యమైన విద్యను అందిస్తున్నామా లేదా?...................... లాంటి విషయాలపై అస్సలు చూపరు..........
.
.
తల్లిదంద్రులు కూడా తమ పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చాయి, క్లాసులో తమ పిల్లవాడి ర్యాంకు ఎంత?
అని చూస్తారే తప్ప, పిల్లల మానసిక పరిస్థితి ఏంటి?, వాళ్ళు నిజంగానే ఇష్టపడి చదువుతున్నారా లేక బలవంతంగా చదివిస్తున్నామా అని చూడరు.......
మార్కులు రాకపోతే ట్యూషన్లు పెడతారు, స్కూలుకి వెళ్ళి వాళ్ళని నిలదీస్తారు......... కానీ అసలు లోపం ఎక్కడ వుంది అని మాత్రం ఆలోచించరు.........
.
.
స్కూలు యాజమాన్యానికి డబ్బులు కావాలి,..........
.
.పిల్లల తల్లిదండ్రులకి మార్కులు, ర్యాంకులు కావాలి..........
.
పిల్లలకి నిజంగా ఏది కావాలో వీళ్ళకి అనవసరం...........
.
వీళ్ళ మధ్య పడి నలిగిపోయేది మాత్రం చిన్నారులే...............
.
పర్యావసానం.............. చిన్నపిల్లల ఆత్మహత్యలు.........
.
ఇది మీడియా వారికి కూడా పండగ చేసుకునే విషయం..... ఎందుకంటే........ వాళ్ళకి వార్తలు దొరుకుతున్న్నాయి కదా మరి..........
కానీ వీళ్ళు మాత్రం కారణాలు, పరిష్కారం లాంటివాతి జోలికి వెళ్ళరు...........
.
.
.
అసలు సమస్య ఎక్కడుంది?
.
దీనికి పరిష్కారం ఏంటి?
.................................................................................????????????????????????????????????

Friday, August 28, 2009

ఆనందం పిచ్చోడిని





నేను నేనే............
ఎవరిమాటా వినను........
నచ్చింది చేస్తా..........
నచ్చనిదీ చేస్తా..............
వచ్చింది...........
అలాగని రానిది చేయను అని పొరబడకండి,
రానిది కూడా చేస్తా..........
.
.
అసలు నేను ఎందుకు చేస్తానో నాకే తెలీదు..............
ఏం చేస్తానో కూడా తెలీదు.........
కానీ ఏమీ చేయకుండా మాత్రం వుండలేను...........
.
.
అందుకే ఇప్పుడు ఏదోఒకటి అని ఇది చేస్తున్నా........
.
.
ఎందుకంటే,

ఇదివరకు ఏం చేశానో తెలీదు,
ఇకపై ఏం చేస్తానో తెలీదు...............
ఇప్పుడు చేసేది నా ఆనందం కోసం......
ఇదివరకు చేసింది కూడా అందికే,
ఇకపై ఏం చేసినా అది కూడా ఆనందం కోసమే.........
కానీ చిన్న తేడా...........
ఆ ఆనందం నాది కావొచ్చు, వేరే ఇంకెవరిదైనా కావొచ్చు..............
.
.
.
ఆ వేరే "ఎవరు" ఎవరు అంటే..........
.
.
.
ఎవరైనా కావొచ్చు..........
.
.
.


ఉపసంహారం: మనం ఏది చేసినా అది మన, మనకిష్టమైనవాళ్ళ ఆనందం కోసమే.......
కానీ మనం ఏం చేస్తున్నామో తెలిసి చేస్తే, ఒక్కనిమిషం ఆలోచించి, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఈ నిమిషం ఆనందంగా వున్నామా లేదా అని ఆలోచించి చేస్తే ఎప్పటికీ ఆనందంగానే ఉండొచ్చు...................

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-4(ఆక్షరాస్యత )



మన దేశంలోని చిన్నారులందరి ముఖాలలో ఇలాంటి చిరునవ్వులు ఎప్పుడు చూస్తామో...............


మన చదువులు ఎలా వున్నాయి?
.
.
గవర్నమెంటు స్కూలు:
గవర్నమెంటు టీచర్లు......... వీళ్ళు పిల్లలకు చదువులు స్కూల్లో చెప్పరు, సాయంత్రం ఇంటిదగ్గిర చెప్తారు.... ట్యూషన్లో......
అలా ఐతే ట్యూషన్ ఫీ కూడా వస్తుంది కదా మరి.....
కొందరు ప్రబుద్దులు అది కూడా చేయరనేది వేరే విషయం..........
నిజాయితీగా పనిచేసేవాళ్లను వేళ్ళపై లెక్కపెట్టవచు.........
ఒకవేళ వీళ్ళు చెప్దాం అన్న వేళ్ళకు ఏమీ రాదు అనేది వేరే విషయం........
ఎందుకంటే వీళ్ళుకూడా ఇలాంటి వాతావరణాం నుండి వచ్చినవాళ్ళే కదా........
గవర్నమెంటు జీతం ఇచ్చేది ఇన్నిసంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించినందుకని వీళ్ళ బలమైన నమ్మకం..........
ఇక స్కూలు విషయానికి వస్తే......... నాలుగు గదులు, చెక్క బెంచీలు, బ్లాకు బోర్డు............
చాలా ఊళ్ళల్లో ఆవులు, గేదెలు, మేకలు కూడా ఇక్కడే వుంటాయి...................
.
.
.
.
మరి ప్రైవేటు స్కూళ్ళో.......... ఇవి చాలా......... బాగున్నాయి అని అనుకుంటే పప్పులో, సాంబారులో, చికెన్లో...... కాలేసినట్లే...........
వీటి నిజస్వరూపం ఏంటో రేపు చూద్దాం..............
అప్పటివరకూ మనదేశం బాగుపడిపోయినట్లు కలలు కంటూ గడిపేద్దాం...............

Thursday, August 27, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-3


అభివ్రుద్దికి తొలి మెట్టు అక్షరాస్యత.
అక్షరాస్యులైన్ ప్రజలుంటే ఏదైనా సాధించొచ్చు.............(సాధించాలనుకొంటే........మన నాయకులు అనుకోరనేది వేరే విషయం అనుకోండి.......)
ఎన్నో దేశాలు ఈ నిజాన్ని ఋజువుచేశాయి కూడా.............
.
.
.
.
అసలు వీడికేం పనిలేదా.............., చదువు, అభివ్రుద్ది అంటాడు,............. పెరుగుతున్న ధరలు, బాబు, ముఖ్యమంత్రి, చిరంజీవి, సినిమా,................ లాంటివాటిపై రాయొచ్చు కదా..........
.
.
.
.

అసలు దేశం ఎందుకు బాగుపడాలి?
మనం బాగానే వున్నాం కదా..............
మన పిల్లల్ని చదివించుకుంటున్నాం కదా........
ధరలు ఇవ్వాళ కాకపోతే రేపు తగ్గుతాయి.........
.
.
.
కానీ అఫీసుకు వెళ్దామని రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ జాం, నిలకడ లేని ప్రభుత్వాలు, రోజుకో కుంభకోణం, చిన్నపిల్లల అత్మహత్యలు........., ఉగ్రవాదుల దాడులు, రైతులు పండించిన పంటకు లేని ధరలు, వాటి ఉత్పత్తుల(ప్రాసెస్డ్ ఫుడ్) ధరలు మాత్రం ఆకాశంలో...........
విదేశాలకు దొంగ ఎగుమతులు............
రోగం వస్తే వైద్యం చేయించుకోలేని మధ్యతరగతి ప్రజలు, 24 గంటలూ కరంటు ఇవ్వలేని ప్రభుత్వాలు..........
ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి?
.
.
జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మళ్ళీ 18-19వ శతాబ్దాల నాటి బ్రిటీషు వారి పాలనకు ఏమాత్రం తీదిపోని సామ్రాజ్యవాదుల చేతిలో వున్నాం అనిపిస్తుంది,..................
తేడా ఒక్కటే, బ్రిటీషు వారు విదేశీ పాలకులు, ఇప్పటి పాలకులు స్వదేశీయులు......................
కానీ ఇరువురి ఆశయం మాత్రం ఒక్కటే....................
.
.
.
బ్రిటీషువారు గుమాస్తాలను తయారు చేసే చదువులను మనకు నేర్పించారని వారిని విమర్శించే మన నాయకులు ఇప్పటి విద్యావిధానంపై నోరు విప్పరేం?
అంతకంటే అధ్వాన్నంగా వున్నాయి మన చదువులు..........
10వ తరగతి పాసైనవాడికి కనీసం కూడికలు, తీఎసివేతలు కూడా రాని పరిస్థితి...........
కేవలం 5 నుండి 10 శాతం మంది పిల్లల చదువులు మాత్రమే సంత్రుప్తికరంగా ఉన్నాయి(ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా)......................
.
.
ఎంతపెద్ద నేరం చేసినా శిక్ష పడకుండా దర్జాగా బయట తిరగొచ్చనేది చిన్నపిల్లాడికి సైతం తెలిసిన నిజం, న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినవాడి జీవితం సగం పూర్తైనా అతగాడికి న్యాయం మాత్రం జరగదు...................
.
.
మరి వీటికి పరిష్కారం లేదా?
మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం మనం ఏంచేయాలి?
...........
..................
.............................

Wednesday, August 26, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-2 (అక్షరాస్యత అంటే.................?)



అక్షరాస్యత అంటే.................?
ఒక వ్యక్తికి సంతకం చేయడం వస్తే అతను అక్షరాస్యుడేనా?
.
.
ఆ సంతకం ఎందుకు ఉపయోగపడుతుంది?
.
.
.
బ్యాంకులో డబులు డ్రా చేయడానికా?
పంట ఋణం తేసుకోడానికా?
జమీందారు దగ్గిర హాజరు వేసుకోడానికా?
రైతు తన జీవితాన్ని వడ్డీవ్యాపారి దగ్గిర తాకట్టు పెట్టాడానికా?
మండలాఫీసులో ఎవరో రాసిన ఆర్జీపై సంతకం చేయడానికా?
పట్నంలో చదువుతున్న తన పిల్లలకు డబ్బు పంపే మనీయార్డరు పై సంతకం చేయడానికా?
.
.
.
.
వీటన్నిటికీ వేలిముద్ర సరిపోతుందే.................?
మరి సంతకం ఎందుకు?
................................
సంతకం వచ్చిన ప్రతివాడూ అక్షరాస్యుడేనా?
.
.
అవును.............!
మన జనాభాలెక్కల ప్రకారం...........
.....
............
...................
మన నాయకులు మనల్ని మభ్యపెట్టడానికి చూపించే కాకిలెక్కల్లొ ఇదీ ఒక స్టంటే !
........
మరి సిసలైన అక్షరాస్యత అంటే ఏది?
ఒక ఎరువుల బస్తాపైనో, ఒక యంత్రంపైనో ముద్రించివున్న సూచనలు, సమాచారం చదివి అర్ధం చేసుకొగలిగినపుడు ...........
ఒక కోర్టు, పంచాయితీ నోటేసు చదవగలిగినపుదు,
ఒక ఆఫీసుకు వెల్లి సొంతంగా ఒక అర్జీ రాసి ఇవ్వగలిగినపుడు,
తను బ్యాంకులో తేసుకున్న ఋణంపై, జమచేసిన డబ్బుపై వడ్డీని లెక్కకట్టుకోగలిగినప్పుడు,
వడ్దీవ్యాపారి దగ్గిర మోసపోకుండా తనను తాను కాపాడుకోగలిగినపుడు,
స్కూలునుండి ఇంటికి వచ్చిన పిల్లలతో హోంవర్కు చేయించగలిగినపుదు,
.
.
.
.
ఒక వ్యక్తిని అక్షరాస్యుడిగా గుర్తించవచ్చు.
.
.
.ఇదీ అక్షరాస్యత అంటే.......... దీనినే నిర్వాహక అక్షరాస్యత అనికూడా అంటారు.....
మనదేసంలో ఇటువంటి అక్షరాస్యులు ఏంతమంది వున్నారు?
??????????????????
60%....?
50%.........?
40%.............?
30%....................?
20%...........................?
15%...................................?
ఇదీ మన అక్షరాస్యుల సంఖ్య................
.
.
.
ఇప్పుడు చెప్పండి మనం బడా నాయకులు, దళారీల చేతిలో మోసపోకుండా ఎలావుండగలం?

Tuesday, August 25, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-2

అక్షరాస్యత..................

ఒక దేశ అభివ్రుద్దిని శాసించేది అక్షరాలా అక్షరాస్యతే...............
వనరులు సరిగా లేని ఎన్నో చిన్న చిన్న దేశాలు విద్యను నమ్ముకొని అభివ్రుద్ది చెంది నేడు మన దేశం కంటే అభివ్రుద్దిలో ఎంతో ముందున్నాయి...............
అభివ్రుద్ది చెందిన చిన్న చిన్న దేశాల్ని చూసి మనం తెలుసుకోవల్సిన నిజం ఇదే...........!
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నిజం మనకందరికీ ఎప్పటినుంచో తెలుసు.......!
.
.
.
ప్రభుత్వం అతి చౌకగా ప్రజలకు ఇవ్వగలిగేది ఒక్క విద్యను మాత్రమే.......
మరి మన ప్రభుత్వాలు ఈ విషయాన్న్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి?
.
.
.
.
దీని వెనుక చాలా పెద్ద కుతంత్రమే దాగి వుంది తప్ప ఇది మన ప్రభువుల నిర్లక్ష్యం మాత్రం కాదు............

ఏంటది?
.
.
.
.
మన ప్రభుత్వాలు నడిచేది అవినీతిపరులైన గూండా నాయకుల కనుసన్నల్లో.......
ప్రజలు విద్యావంతులు, విఙానపరులు ఐతే వేరి ఆటలు సాగవని వేరికి బాగా తెలుసు,.......... ప్రజలు నిరక్ష్యరాస్యత, దారిద్ర్యంలో వీరిపై ఆధారపడి బ్రతికితేనే వీరి రాజ్యం సాగుతుందనే కుతంత్ర ఆలోచనకు కార్యరూపమే మనదేశపు నిరక్షరాస్యతకు సిసలైన కారణం..........
.
.
.
దీనికి పరిష్కారం లేదా?

Sunday, August 23, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?

ఒక దేశం అభివ్రుద్ది చెందాలంటే ఏం కావాలి?
డబ్బు?
సహజ సంపదలు?
పెద్ద పెద్ద పరిశ్రమలు?
ఎక్కువ జనాభా?
యువత?
గొప్ప నాయకులు?
పె.........ద్ద రాజ్యాంగం?
విదేశీ సహకారం?
విదేశీ మారక ధనం?
.
.
.
.
.
మన దేశానికి ఇవన్నీ వున్నాయి కదా........
ఐనా..............
.
.
.
ఎందుకని మన దేశం ఎప్పటికీ.................... అభివ్రుద్ది చెందుతూనే........... వుంటుంది?

పై వనరులు సరిగా లేని దేశాలు అభివ్రుద్ది చెందలేదా?
అది ఎలా సాధ్యపడింది?
ఆ దేశాలు ఎలా అభివ్రుద్ది చెందాయి?
ఇది ఒక చిన్న ప్రశ్న మాత్రమే కాదు.............
.
.
.
.

దీని వెనుక ఒక భయంకరమైన నిజం దాగుంది......... అదేంటో మనకు తెలుసు, కానీ ఆ కోణంలో మనం ఆలోచించకపోవడం నిజంగానే మన దురద్రుష్టం, కానీ ఇప్పుదు ఆలొచించాల్సిన సమయం వచ్చింది........

వినాయక చవితి శుభాకాంక్షలు






స్వామీ విఘ్నేశ్వరా! నాదేశం బాగుపడాలంటే ప్రజలు విద్యావంతులు, విఙ్నూలు కావాలి........ ఆదిశగా ఉడతాభక్తితో నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా సాగేలా ఆశేర్వదించుమా...........
ఈ వినాయకచవితి అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించుగాక

Saturday, August 22, 2009

శుభోదయం


నేస్తమా ఈ ఉషాకిరణాలు నిన్ను తట్టి లేపుతుంటే,
వాలిపొయే నీ కనురెప్పల మాటున కోటి కలలు ఉదయించాలని...........
నీ ప్రతి కలా నిజం కావాలని ఆశిస్తూ...........


శుభోదయం

ఇట్లు
మీ శ్రేయోభిలాషి

వానలు-ప్రభుత్వం

దండిగా వానలు కురవాలంటే నన్ను గెలిపించండి అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఇపుడేం సమాధానం చెప్పగలరు రాష్త్ర ప్రజలకి?
వానలు లేవు, రైతులకు దారి తోచట్లేదు, ప్రభుత్వానికి ఇదేం పట్టినట్లుగా అనిపించట్లేదు, రైతులకు ఏం పంటలు వెయ్యాలొ తెలియని పరిస్థితి, ఇకనైనా నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కొంటే మంచిది.................
ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని పొయిన ఎన్నికల్లో గెలిచారు, వాటిని అడ్డం పెట్టుకొని వేలకోట్లు వెనకేసుకున్నారు కాని పూర్తి చేయలేదు, అప్పుదు పడ్డ వానలన్నీ సముద్రాలపాలు చేశారు, ఇప్పుడేమో వానలు లేవు.................]ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ రాష్త్రాన్ని ఏం చేస్తారో.................... ఈ ప్రచార ప్రభువులు......
ప్రచారం మీద వున్న శ్రద్దలో ఏ కొంతైనా ప్రజలపైన వుంటే మనకు ఈ దుర్గతి వుండేది కాదేమో.........
ఈ రాష్త్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.................

Tuesday, August 18, 2009

నేనూ గీస్తా బొమ్మలు....................











Thursday, August 13, 2009

తెలుగు బిడ్డలారా మేల్కొనండి!

పెరుగుతున్న ధరలు చూడు,
నీళ్ళు లేని నదులు చూడు,
డబ్బుల్లేని ఖజానా చూడు,
నిరుద్యోగ జనాన్ని చూడు,
............................................................