Showing posts with label సరదాకి. Show all posts
Showing posts with label సరదాకి. Show all posts

Sunday, May 2, 2010

ప్రకృతి

పనీ పాటా లేనప్పుడు ఏదోఒకటి చేయాలనిపిస్తుంది,
ఆ "ఏదోఒకటి" మన అభిరుచులను, ఆలోచలనలను ప్రతిబింబిస్తుంది,
ఫోటోషాప్ లో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక  ఫోటోని ఇలా ఎడిట్ చేశాను.......
ఈ ఫోటో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 
"ప్రకృతిని ప్రేమించండి, పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా వుంచండి..... అది మనకు ఎంతో శ్రేయస్కరం, ఆరోగ్యదాయకం" 








Tuesday, December 15, 2009

బుద్ది???????????????????





ఈరోజు బుద్దిగా నాపని నేను చేసుకుంటుండగా నాకో అదేనండీ ధర్మసందేహం (మా గురువుగారు మాకు అలాగే నేర్పారు లెండి) వచ్చిందండీ,....................
మీరేమైనా తీర్చగలరా?
.
.
.
.
.
.
.

ప్ర్రాణుల్లోకెల్లా బుద్దిలేని ప్రాణి ఏది?

Monday, December 7, 2009

ఎవరు?



నువ్వు నవ్వినా,
నువ్వు ఏడ్చినా,

నీ కష్టాల్లో,
నీ సుఖాలలో,

నీ బాధల్లో,
నీ సంతోషాల్లో,

కావాలోయ్ నీకొక  తోడు............
...................................................................
పంచుకున్నా,
తెంచుకున్నా,

తిట్టుకున్నా,
కొట్టుకున్నా,

కలిసున్నా,
విడిపోయినా,
..........................
............................
కావాలొక నేస్తం...............

కలకాలం తోడుండేది మనిషేనోయ్

Thursday, October 1, 2009

నేను............................. ఎవరు నేను?





Tuesday, September 1, 2009

ఆనందం పిచ్చోడిని -4



నేను  విన్న అతిపెద్ద జోకులు:
1) వర్షాలు బాగా కురవాలంటే  మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
                                                    -ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి

2) రాష్త్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంది, ఆర్ధికమాంద్య ప్రభావం మనరాష్ట్రంపై పెద్దగా లేదు.
                                                           -ఎన్నికలకు ముందు ఆర్ధిక మంత్రి
   ఆర్ధికమాంద్యం ప్రభావం మన రాష్ట్రంపై తీవ్రంగా ఉంది, బడ్జెట్ కూడా సమకూరడంలేదు.
(బడ్జెట్ సమావేశాలకు ముందు, ఎన్నికలకు తర్వాత)

3) డెంగ్యూ కూడా మామూలు జ్వరమే, దేవుడు కరుణిస్తాడు, త్వరలోనే తగ్గిపోతాయి.
                                                           -ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి.

4) ప్రాజెక్టులు మట్టితో కడితే వరదలు వచ్చినపుడు కూలగొట్టవచ్చు.
                                          -ముఖ్యమంత్రి.

5) మా కుటుంబంలోనివారు అధికారంలో వుండివుంటే బాబ్రీ కూలిపోయివుండేదికాదు.
                                                                           -రాహుల్ గాంధీ.

6) ప్రతిపక్షాలు విఫలం అయ్యాయి.
                       -ముఖ్యమంత్రి.

7) రాశ్ట్రంలో ప్రజలు పండగ చేసుకుంటున్నారు.
                                           -జగన్.

8) 200 తో కుటుంబానికి నెలకు సరిపడా భత్యం అందిస్తున్న ప్రభుత్వం.
                                                                 -సాక్షి.

Monday, August 31, 2009

ఆనందం పిచ్చోడిని -3 (జవాబులు)

ఏమై ఉండేది?

బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
భారతదేశానికి తిండికి కరువు వచేది................

గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
ఫోన్ ని వేరేవాడు కనిపెట్టీ వుండేవాడు....................

బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
లెక్కలు చేయాల్సిన బాధ వుండేది కాదు..................

దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
ఆ తోకని కూడా అలంకరించుకోవాల్సివచ్చేది, ప్యాంటు ఇప్పుడున్నత్లు వుండేది కాదు..................

రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్  ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
అలా ఎలా అనుకుంటాడండీ, అది వర్కవుట్ కాదు కదా...................

గాంధీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
ఆయన కూడా భాభా, అదేనండీ భార్యా బాధితుడు అయి ఉండేవాడు....................

ఐన్ స్టీన్ E=mc^2  అని కాక e=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
అతనికి నోబేల్ బహుమతి వచ్చేది కాదు, ఆతర్వత వేరేవాడికి వచ్చేది......................

న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
న్యూటన్ తల పగిలేది......................

Sunday, August 30, 2009

ఏమై ఉండేది?

ఏమై ఉండేది?

బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
..............
గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
..................
బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
..................
దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
..................
రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్  ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
...................
గాంధీ మళ్లీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
...................
ఐన్ స్టీన్ E=mc^2  అని కాక E=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
....................
న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
.....................