Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts

Saturday, May 1, 2010

ప్రస్థానం

మానవతా విలువలను, 
ఒక మనిషి తన జీవన ప్రస్థానంలో ఎదుర్కొనే ఆటుపోట్లను, 
మనిషి పై సమాజం ప్రభావాన్ని, 
అధికార దాహాన్ని 
ఒకే సినిమాలో కథ చెడకుండా చాలా చక్కగా చూపించారు, 
తప్పక చూడాల్సిన సినిమా...................









 ఈ సినిమా విశేషాలకోసం ఇక్కడ చూడండి.

Tuesday, December 15, 2009

చదువంటే ఇంత కష్టమా.............?

 
చదువంటే ఇంత కష్టమా.............?

ప్రతి దేశంలోనూ విద్యావ్యవస్థను నడిపించడానికి విద్యాశాఖ, ఆశాఖకు కొన్ని నిధులు వున్నాయి కాబట్టి మనదేశంలో కూడా వున్నాయి.
స్కూళ్ళు, టీచర్లు, సిలబస్, పుస్థకాలు ఉండాలి కాబట్టి అవి కూడా వున్నాయి................
కానీ అక్కడికీ మనకీ ఒక తేడా............
పాలకులు......................
ప్రజలకు నిజమైన విఙ్నానం   చేరువైతే నాయకులను తన్ని తగలేస్తారు..............
వాళ్ళు విఙ్నులు  కావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య...........
అది వాళ్ళకు సరైన మార్గంలో చేరకూడదు...........
.......................
నాసిరకం విద్యావిధానాలు, వసతులు లేని పాఠశాలలు,...............
> లెక్కలంటే అంకెలు, సూత్రాలు, కూడికలు, తీసివేతలు వగైరా..............
> సాంఘిక శాస్త్రం అంటే మన నాయకుల పూర్వీకుల గొప్పతనాన్ని పొగిడేందుకు ఉద్దేశించబడిన, అందరూ చదవాల్సిన శాస్త్రం..............
> సైన్సు అంటే ప్రపంచంలో అందరూ చదువుతున్న్నరు కాబట్టి మనమూ చదవాల్సిన అంశం..... బట్టీ పట్టాల్సిన శాస్త్రం..............
> భాషలు నేర్చుకోకపోతే పై శాస్త్రాలు చదవలేరు కాబట్టి నేర్చుకోవాలి...........
.............. విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం మాత్రం సహజంగా పిల్లలకుండే ప్రశ్నించే తత్వాన్ని, అవగాహనాసామర్ధ్యాన్ని, పరిశీలనా శక్తిని సమూలంగా చంపివేసి వాటిస్థానే బట్టీ పట్టడం, బుర్ర సక్రమంగా పని చేయకుండా ఒకదానికొకటి సంబంధంలేని చెత్త విషయాలతో నింపేయడం.
దీనికి తగ్గట్టుగానే సిలబస్ లు తయారు చేశారు, పరీక్షావిధానం సైతం తదనుగుణంగానే తయారుచేయడం జరిగింది, పుస్తకంలో వున్నది వున్నట్టుగానే పరీక్షలో రాశారా లేదా అని పరీక్షిస్తారు...........
............
కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం...........
గత 62 సంవత్సరాలుగా ఈ తరహా విధానాలను చాలా ప్రణాళికాబద్దంగా, జాగ్రత్తగా అమలు చేస్తూవస్తున్న ప్రభువులకు నిజంగా హ్యట్సాఫ్........
 

Saturday, December 12, 2009

ఏం చేద్దాం?




ప్రాంతాలు, రాష్ట్రాలు అని కొట్టుకోవడం మానేసి ఒక్కసారి భవిష్యత్తులోకి తొంగిచూద్దాం, కాలుష్య నియంత్రణ, గ్లోబల్ వార్మింగ్ మీద సదస్సులు, ఒప్పందాలు అంటున్నారు................. కారణాలు, అనర్ధాలు  మనకు తెలుసు, చిన్నపిల్లవాడిని అడిగినా గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాడు, కానీ పరిష్కారం ఏమిటి?
............................
మనచేతుల్లో ఏం వుంది, ప్రభుత్వాలు, పరిశ్రమల అధినేతల చేతుల్లో వుంది  అంటారా?
అప్పుడు మన భవిష్యత్తు కుడా మనచేతుల్లో వుండదు................
పెద్ద పెద్ద విజయాలకు చిన్న చిన్న సంకల్పాలే పునాదులు.......
విప్లవం ఒక్కసారిగా రాదు, ఒక్కరితోనే మొదలవుతుంది.............
ఆఒక్కరు మనమే ఎందుకు కాకూడదు?
(రొటీన్ డైలాగ్ కదా? కానీ నిజం కదా, అంతకంటే వేవ్ర్ దారి లేదు మరి మనకి............. )
మన ప్రయత్నం మనం చేద్దాం, ఎవరినో నిందించకుండా................
బాధ్యత తెలిసినవాడు తనకార్యం మరిచి  ఇతరులను నిందిస్తూ  కుర్చోడు.............
భూమాతను రక్షించుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం....................

Thursday, December 10, 2009

ఇప్పుడేంచెయ్యాలి తెలంగాణావాదులు? (అయితే ఎన్ని ముక్కలు?)


?
 
 సమైక్యాంద్రా?


రాష్ట్రం ముక్కలా?
అయితే ఎన్ని ముక్కలు?


కేసిఆర్ దీక్షతో తెలంగాణా రావడం సంగతి పక్కన పెడితే రోశయ్య అంటే గిట్టనివాళ్ళకు మాత్రం మంచి చాన్స్ తెచ్చిపెట్టింది.
చిదంబరం హామీని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోన్నట్లు కనిపిస్తుంది చూడబోతే..........
అంతేకాదండోయ్ తెలంగాణా ఇవ్వడం కుదరదు, ఇప్పుడు, ఎప్పటికీ.................. అని బలమైన సందేశాన్ని డైరేక్తుగాను, ఇండైరేక్తుగాను బల్లగుద్దిమరీ చెప్పేశారు.
తెలంగాణా వాదులు దీనికి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.............
 రాష్ట్రాన్ని ముక్కలు చేసేలాగైతే నేనూ నిరాహార దీక్ష చేస్తా నాకూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని..........................
అదేనండి మావూరిని కుడా ప్రత్యేక రాష్ట్రంగా గుర్త్ఘించాలని..............

Saturday, October 3, 2009

పండగ చేసుకున్నారా?











 
గాంధీ జయంతి............... పండగ రోజు
నిజంగానే గాంధీ జయంతి మనందరికీ పండగ రోజు..........
నన్ను నమ్మండి..................
రాహుల్ గాంధీ లాంటి సమర్ధుడు భావి ప్రధానిగా మనముందు వున్నాడంటే అది ఆ మహాత్ముడి చలవే మరి...........
భారతదేశం ప్రపంచంలో అతి.........???????????పెద్ద.........?????????? ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నా, నిరంతరం అభివ్రుద్దిచెందుతూ...........నే............. వుందన్నా,
చైనా, పాకిస్థాన్లు మ్నన్ భూభాగాన్ని యధేచ్చగా ఆక్రమించుకుంటున్నా మనం వాళ్ళని
సహనంతో క్షమిస్తున్నామన్నా.............. అది తప్పకుండా ఆ మహత్ముడి చలవే మరి...............
..................
"మా కుటుంబంలోని వారెవరైనా ప్రధానిగా వుండి వుంటే
బాబ్రీ మసీదు కూలకుండా ఆపివుండేవాళ్ళం"
అని చెప్పిన రాహుల్ గాంధి మాటల్లోనే తెలుస్తుంది మనం గాంధీ ని ఎందుకు గౌరవించాలో..............
...................
..........................
అంతా బాగుంది కానీ,
గాంధీ జయంతి, నెహ్రూ జయంతి ఇంత ఆర్భాటంగా జరుపుకుంటున్న మనం,
పటేల్ జయంతి, సుబాష్ చంద్ర బోస్ జయంతి, భగత్ సింగ్ జయంతి, ఝాన్సీ రాణీ జయంతి..................
ఇవి ఎందుకు జరుపుకోం?
అసలు అవి ఎప్పుడు వస్తాయో కుడా మనకు తెలీదు......
.............................
దయచేసి వాళ్ళెవరు???????????????????? అని మాత్రం అడగకండేం................
మన చరిత్రను కాపాడుకొందాం..................
మన సోషల్ పుస్తకాల్లోని చరిత్ర పాఠాలు గుడ్డిగా చదివేసి అదే నిజమని నమ్మేయడం కాదు
చరిత్రను  కాపాడుకోవడం అంటే,
వెనక్కి తిరిగి చూసి, సహేతుకంగా ఆలోచించి ,నిజాలను మన తరువాతి తరాలకు అందజేయడం................

వీడేంటీ నిన్న గాంధీ జయంతి ఐతే ఈరోజు సోది చెపుతున్నాడు అనుకుంటున్నారా?
ఎంతోమంది భారతీయులు పండగ చేసుకుంటున్నారు కదా
వారినెందుకు నొప్పించడం అని...........
కానీ నిజాలు తెలుసుకొని చరిత్రలో జరిగిన తప్పిదాలు పునరావ్రుతం కాకుండా చూసుకోవడంపైనే మన భవిష్యత్తు అధారపడి వుందన్నది వాస్తవం...............
అది ఒక కుటుంబమైనా కావచ్చు, ఒక దేశమైనా కావచ్చు........................

Friday, September 4, 2009

చరిత్రలో ఓ రక్తపు పుట

ఒక వ్యక్తి గొప్పతనం అతడిని కోల్పోయినపుడే తెలుస్తుందంటారు,
మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడోఒకప్పుడు సంభవించవలిసిందే కానీ అర్ధాంతరంగా ఒక వ్యక్తి 
తనువు చాలించినపుడు అతని ఆప్తులుకు, బంధు మిత్రులకు అది కలిగించే బాధ వర్ణనాతీతం.
ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం లోని ప్రజలు ప్రతిరోజూ తలుచుకునే వ్యక్తి, అందునా  వంటి వ్యక్తిని తలుచుకోనివారుండరంటే అతిశయోక్తి కాదేమో...............
ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఒక సంచలనమే............... మన రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సైతం మన ముఖ్యమంత్రిని తలుచుకోని రోజుండదేమో............
భౌతికంగా అతడు మరణించినా
అతని చేతలు, వ్యక్తిత్వం అతడికి ప్రజల గుండెల్లో చిరకాల స్థానాన్ని సంపాదించి పెట్టాయి.............
అతడి ఆశయాల రూపంలో అతడు ఎప్పటికీ బతికేవుంటాడు...............
  అలాంటి నిత్య సంచలనశీలిని అభిమానించేవారెందరో ఉన్నా, ద్వేషించేవారూ లేకపోలేదు, 
వారికి సైతం ఈయన మరణం ఏమాత్రం మింగుడు పడని విషయం,
ఎందుకంటే ఆయనపై వారికున్నది సైద్దాంతికపరమైన ద్వేషమే తప్ప వ్యక్టిగతమైనది కాదు,........
రేపటినుండి వారు ఎవరిని విమర్శించగలరు చెపండి?
ఐనా  లాంటి శాంతస్వరూపుడికి శత్రువులెవరుంటారు చెప్పండి.............
ఆయన మరణించిన రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దురద్రుష్టకరమైన రోజు................
మళ్ళీ మనకు అలాంటి నాయకుడు దొరకడు..............
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, ఇకపై కూడా వస్తారు, 
కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం దొరకడు గాక దొరకడు, 
ఇతడు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాడు................
 అతని సదాశయాలు నెరవేరాలని, అతడు రాష్ట్రప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలని, అతని ఆత్మకు శంతి చేకూరాలని ఆ భగవంతుడిని మరోసారి మనసారా ప్రార్ధిద్దాం....................
ఫొటోలు

Thursday, September 3, 2009

ముఖ్యమంత్రి ఇక లేరు................



రాజకీయ ఉద్దండుడు, ముఖపై చిరునవ్వును చెరగనీయని శాంతస్వరూపుడు, తను తలిచిన పనిని ఎంత కష్టమైనా వెరవక పూర్తిచేసేవరకు నిద్రకూడా పోని సంకల్పబలుడు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు, తెలంగాణా, ఆంధ్రా, సీమ అంటూ నిత్యం భిన్న అభిప్రయాలు వ్యక్తంచేసే నాయకులను, సమైక్యత లేని  పార్టీని, ఏకతాటిపై నడిపించిన మేధావి, విభిన్న ఆలోచనలు, పథకాలతో పొరుగు రాష్త్రాలు, కేంద్రం మన్ననలను కూడా పొందిన మన ముఖ్యమంత్రి గత 22గంటలుగా కనిపించకపోవడం నిజంగానే బాధాకరమైన విషయం.
రాత్రి 9:00 గం. వరకు ఎంతమంది ఎన్ని విధాలుగా వెతికినా ఫలితం శూన్యం............
ఆతర్వాత కూడా గిరిజనులు, గ్రేహౌండ్స్ దళాలు, ప్రయత్నాలు కొనసాగించాయి, ఆధునిక మెటల్ డిటేక్టర్ల సాయం కూడా తీసుకుంటున్నారు, శాటిలైట్ చిత్రాలలో సైతం ఎటువంటి సమాచారం లభించలేదు. ఇస్రో, రక్షణ శాఖ తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి, అమెరికా ఆర్మీ సైతం ముందుకు వచ్చింది, ఐనా మిస్టరీ మాత్రం వీడలేదు, జూపల్లి క్రుష్నారావు వంటి మంత్రులు సైతం గాలింపుచర్యలు చేపట్టారు, ఈరోజు నల్లమల అడవులను శ్రీశైలానికి చెందిన జీవావరణ వేత్త తులసీరావు సాయంతో గాలించాలని నిర్ణయించారు, ఈరోజు గాలింపులను మరింత తీవ్రతరం చేయనున్నారు, ఎలాగైనా ముఖ్యమంత్రీఅచూకీ కనిపెడతారు, కానీ మనసెందుకో కీడు శంకిస్తుంది, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం శ్రీశైలం డ్యాం లో ఏదో పడినట్లు పెద్దశబ్దం వచ్చిందని, నీటిపై ఆయిల్ తేలుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారం మినహా మరే మాత్రం ఆచూకీకి సంబంధిన సమాచారం లేదు...............
ఆయన దుర్మరణం పాలయ్యారని తెలిసి రాష్ట్రప్రజల గుండెలు పగిలాయి.................
ఆయన ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవుడిని మనసారా  దేవుడిని ప్రార్ధిస్టూ.............

Wednesday, September 2, 2009

CM MISSING............

ముఖ్యమంత్రిగారు తప్పిపోయారట..................
హెలికాప్టర్ అత్యవసరంగా దింపేశారట............
ఆయన క్షేమమేనని సమాచారం.................
ఎంతవరకు నిజమో తెలీదు.................
ఉదయం 9:30 ముఖ్యమంత్రి తప్పిపోతే 2:00 కి మనకి తెలిసింది, మన సమాచార వ్యస్థ చూడండి ఎంత గొప్పగా వుందో...............
రోజ ఎంతపని చేశావమ్మా..............
కొందరు CM గారు చచ్చిపోయినట్లేనన తీర్మానించేశారు.............
పాపీ చిరాయు అన్నరు పెద్దలు...................
EmavutundO vechi chudali, repativaraku.............
ISRO, US army kuda rangasmloki digai............
if anybody found him please inform at idupulapaya or saakshi

Friday, August 28, 2009

ఆనందం పిచ్చోడిని





నేను నేనే............
ఎవరిమాటా వినను........
నచ్చింది చేస్తా..........
నచ్చనిదీ చేస్తా..............
వచ్చింది...........
అలాగని రానిది చేయను అని పొరబడకండి,
రానిది కూడా చేస్తా..........
.
.
అసలు నేను ఎందుకు చేస్తానో నాకే తెలీదు..............
ఏం చేస్తానో కూడా తెలీదు.........
కానీ ఏమీ చేయకుండా మాత్రం వుండలేను...........
.
.
అందుకే ఇప్పుడు ఏదోఒకటి అని ఇది చేస్తున్నా........
.
.
ఎందుకంటే,

ఇదివరకు ఏం చేశానో తెలీదు,
ఇకపై ఏం చేస్తానో తెలీదు...............
ఇప్పుడు చేసేది నా ఆనందం కోసం......
ఇదివరకు చేసింది కూడా అందికే,
ఇకపై ఏం చేసినా అది కూడా ఆనందం కోసమే.........
కానీ చిన్న తేడా...........
ఆ ఆనందం నాది కావొచ్చు, వేరే ఇంకెవరిదైనా కావొచ్చు..............
.
.
.
ఆ వేరే "ఎవరు" ఎవరు అంటే..........
.
.
.
ఎవరైనా కావొచ్చు..........
.
.
.


ఉపసంహారం: మనం ఏది చేసినా అది మన, మనకిష్టమైనవాళ్ళ ఆనందం కోసమే.......
కానీ మనం ఏం చేస్తున్నామో తెలిసి చేస్తే, ఒక్కనిమిషం ఆలోచించి, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఈ నిమిషం ఆనందంగా వున్నామా లేదా అని ఆలోచించి చేస్తే ఎప్పటికీ ఆనందంగానే ఉండొచ్చు...................