Monday, August 31, 2009

ఆనందం పిచ్చోడిని -3 (జవాబులు)

ఏమై ఉండేది?

బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
భారతదేశానికి తిండికి కరువు వచేది................

గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
ఫోన్ ని వేరేవాడు కనిపెట్టీ వుండేవాడు....................

బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
లెక్కలు చేయాల్సిన బాధ వుండేది కాదు..................

దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
ఆ తోకని కూడా అలంకరించుకోవాల్సివచ్చేది, ప్యాంటు ఇప్పుడున్నత్లు వుండేది కాదు..................

రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్  ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
అలా ఎలా అనుకుంటాడండీ, అది వర్కవుట్ కాదు కదా...................

గాంధీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
ఆయన కూడా భాభా, అదేనండీ భార్యా బాధితుడు అయి ఉండేవాడు....................

ఐన్ స్టీన్ E=mc^2  అని కాక e=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
అతనికి నోబేల్ బహుమతి వచ్చేది కాదు, ఆతర్వత వేరేవాడికి వచ్చేది......................

న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
న్యూటన్ తల పగిలేది......................