ప్రేమగా ప్రేమించాను తనని.......
నా ప్రేమవు నువ్వేనని చెప్పాను వద్దనుకుంటూనే, చెప్పకపోవడం తప్పనిపించి............
తనూ చెప్పేసింది, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోమని............
నేనూ చెప్పాను ప్రేమిస్తూనే ఉంటానని, ప్రేమ వేరు, ఆలోచన వేరు కదా..........
పాపం తను మాత్రం ఏం చేయగలదు?
నీతో నాకు కటీఫ్ ఫో అంది...........
.
.
కొన్ని రోజుల తరువాత....................
నా బాధ చూడలేక మాట్లాడ్డం మొదలెట్టింది...............
తనను ఇబ్బంది పెట్టలేక సంతోషం నటించాను..............
నటిస్తూనే వున్నా..............
సవంత్సరం గడిచింది.................
ఇంకా నటిస్తూనే వున్నా...............
ఏదో సినిమాలో చెప్పారు "ప్రేమ మధురం, త్యాగం అమరం" అని..........
అది నిజమో కాదో తెలియదు కానీ...............
నాకు మాత్రం వేరే దారి లేదు...........
తన స్నేహంలోని మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ బతికేస్తాను..................
తన ఆనందం నా ఆనందం కాదా?