Monday, August 31, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-6 (నిరుద్యోగం)

 
మనకూ ఇలాంటి నాయకుడే ఉండాల్సింది.................1947 కి ముందు
నిరుద్యోగం మన దేశానికున్న అతి ప్రధానమైన సమస్య............
దేశంలో కొన్ని లక్షల మంది పట్టబద్రులున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం లేవు.............
వీరంతా నిరుద్యోగులుగా ఎందుకున్నారు?
ప్రభుత్వశాఖల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వాలు వాటిని భర్తీ చేయవు,
ఆ ఉద్యోగాలన్నీ భర్తి చేసినా ఇంకా నిరుద్యోగులు మిగిలేఉంటారు, కానీ నిరుద్యోగం ఒక సమస్య అని భావించి దాని రూపుమాపాలని ఈ ప్రభుత్వాలు భావిస్తే చాలా సులభంగా ఆ పనిని చేయవచ్చు............
అలాగని వాటిని భర్తీ చేయకపోవడాన్ని కానీ, నిధులు లేక భర్తీ చేయట్లేదనే కుంటి సాకుని గానీ సమర్ధించలేం.......................
ఎందుకంటే మనదేశాంలో ఉపాధి అవకాసాలు మెండు, ప్రభుత్వం ఆ అవకాశాలు ప్రజలకు చేరే మార్గాన్ని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య నిర్మూలనే కాక, ప్రభుత్వానికి సైతం ఎంతో ఆదాయం చేకురుతుంది.......
అదెలాగ అంటే స్యయం ఉపాధి పథకాలు, కుటీర పరిశ్రమలు మొదలగు వాటిని ప్రోత్సహించడం ద్వారా, మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, రవాణా.......... వంటి వాటిని ప్రజలందరికీ అందేలా చూడడం,............
మనప్రభుత్వాలు ఇలాంటి చర్యలేమీ తీసుకోవట్లేదా అనే ప్రశ్నకు "తీసుకుంటున్నాయి" అనే సమాధానం చెప్పల్సివుంటుంది, ఎందుకంటే కాగితాల్లో లెక్కల ప్రకారం అవన్నీ జరుగుతున్నాయి, కానీ అవి ప్రభువులకు, వారి బంధువర్గానికీ............... ఆదాయ వనరులుగా ఉపయోగపడడానికే అన్నది అక్షరసత్యం..................
నిరుద్యోగాన్ని ఎందుకు రూపుమాపరు అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మళ్ళి నిన్న చెప్పుకున్న 
"కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం..........." అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే చక్కగా అర్ధం అవుతుంది..............
ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే, కానీ ఎప్పుడూ పెద్దగా ఆలోచించివుండం.......... అందుకే గుర్తుచేస్తున్నా.................
ఈ విషయంలో మనం ఏమీ చేయలేమా అంటే......................
చేయగలం.............
ఎలా?
మనకున్న సమస్యల్లో ప్రధానమైన రెండు సమస్యలు  విద్య, నిరుద్యోగం ల గురించి చర్చిచాం, ఇవేకాక ఇలాంటి ప్రధానమైన సమస్యలు మరికొన్ని వున్నాయి, ముందు అవి కూడా చర్చించేశాక, అప్పుడు అన్ని సమస్యలకూ కలిపి పరిష్కారాన్ని ఆలోచిద్ద్దాం............

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు  పెద్దలు.................

1 comments:

Unknown said...

correct ga chepparu,
its time to take it seriously..........