Tuesday, December 15, 2009

బుద్ది???????????????????





ఈరోజు బుద్దిగా నాపని నేను చేసుకుంటుండగా నాకో అదేనండీ ధర్మసందేహం (మా గురువుగారు మాకు అలాగే నేర్పారు లెండి) వచ్చిందండీ,....................
మీరేమైనా తీర్చగలరా?
.
.
.
.
.
.
.

ప్ర్రాణుల్లోకెల్లా బుద్దిలేని ప్రాణి ఏది?

చదువంటే ఇంత కష్టమా.............?

 
చదువంటే ఇంత కష్టమా.............?

ప్రతి దేశంలోనూ విద్యావ్యవస్థను నడిపించడానికి విద్యాశాఖ, ఆశాఖకు కొన్ని నిధులు వున్నాయి కాబట్టి మనదేశంలో కూడా వున్నాయి.
స్కూళ్ళు, టీచర్లు, సిలబస్, పుస్థకాలు ఉండాలి కాబట్టి అవి కూడా వున్నాయి................
కానీ అక్కడికీ మనకీ ఒక తేడా............
పాలకులు......................
ప్రజలకు నిజమైన విఙ్నానం   చేరువైతే నాయకులను తన్ని తగలేస్తారు..............
వాళ్ళు విఙ్నులు  కావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య...........
అది వాళ్ళకు సరైన మార్గంలో చేరకూడదు...........
.......................
నాసిరకం విద్యావిధానాలు, వసతులు లేని పాఠశాలలు,...............
> లెక్కలంటే అంకెలు, సూత్రాలు, కూడికలు, తీసివేతలు వగైరా..............
> సాంఘిక శాస్త్రం అంటే మన నాయకుల పూర్వీకుల గొప్పతనాన్ని పొగిడేందుకు ఉద్దేశించబడిన, అందరూ చదవాల్సిన శాస్త్రం..............
> సైన్సు అంటే ప్రపంచంలో అందరూ చదువుతున్న్నరు కాబట్టి మనమూ చదవాల్సిన అంశం..... బట్టీ పట్టాల్సిన శాస్త్రం..............
> భాషలు నేర్చుకోకపోతే పై శాస్త్రాలు చదవలేరు కాబట్టి నేర్చుకోవాలి...........
.............. విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం మాత్రం సహజంగా పిల్లలకుండే ప్రశ్నించే తత్వాన్ని, అవగాహనాసామర్ధ్యాన్ని, పరిశీలనా శక్తిని సమూలంగా చంపివేసి వాటిస్థానే బట్టీ పట్టడం, బుర్ర సక్రమంగా పని చేయకుండా ఒకదానికొకటి సంబంధంలేని చెత్త విషయాలతో నింపేయడం.
దీనికి తగ్గట్టుగానే సిలబస్ లు తయారు చేశారు, పరీక్షావిధానం సైతం తదనుగుణంగానే తయారుచేయడం జరిగింది, పుస్తకంలో వున్నది వున్నట్టుగానే పరీక్షలో రాశారా లేదా అని పరీక్షిస్తారు...........
............
కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం...........
గత 62 సంవత్సరాలుగా ఈ తరహా విధానాలను చాలా ప్రణాళికాబద్దంగా, జాగ్రత్తగా అమలు చేస్తూవస్తున్న ప్రభువులకు నిజంగా హ్యట్సాఫ్........
 

Saturday, December 12, 2009

ఏం చేద్దాం?




ప్రాంతాలు, రాష్ట్రాలు అని కొట్టుకోవడం మానేసి ఒక్కసారి భవిష్యత్తులోకి తొంగిచూద్దాం, కాలుష్య నియంత్రణ, గ్లోబల్ వార్మింగ్ మీద సదస్సులు, ఒప్పందాలు అంటున్నారు................. కారణాలు, అనర్ధాలు  మనకు తెలుసు, చిన్నపిల్లవాడిని అడిగినా గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాడు, కానీ పరిష్కారం ఏమిటి?
............................
మనచేతుల్లో ఏం వుంది, ప్రభుత్వాలు, పరిశ్రమల అధినేతల చేతుల్లో వుంది  అంటారా?
అప్పుడు మన భవిష్యత్తు కుడా మనచేతుల్లో వుండదు................
పెద్ద పెద్ద విజయాలకు చిన్న చిన్న సంకల్పాలే పునాదులు.......
విప్లవం ఒక్కసారిగా రాదు, ఒక్కరితోనే మొదలవుతుంది.............
ఆఒక్కరు మనమే ఎందుకు కాకూడదు?
(రొటీన్ డైలాగ్ కదా? కానీ నిజం కదా, అంతకంటే వేవ్ర్ దారి లేదు మరి మనకి............. )
మన ప్రయత్నం మనం చేద్దాం, ఎవరినో నిందించకుండా................
బాధ్యత తెలిసినవాడు తనకార్యం మరిచి  ఇతరులను నిందిస్తూ  కుర్చోడు.............
భూమాతను రక్షించుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం....................

Thursday, December 10, 2009

ఇప్పుడేంచెయ్యాలి తెలంగాణావాదులు? (అయితే ఎన్ని ముక్కలు?)


?
 
 సమైక్యాంద్రా?


రాష్ట్రం ముక్కలా?
అయితే ఎన్ని ముక్కలు?


కేసిఆర్ దీక్షతో తెలంగాణా రావడం సంగతి పక్కన పెడితే రోశయ్య అంటే గిట్టనివాళ్ళకు మాత్రం మంచి చాన్స్ తెచ్చిపెట్టింది.
చిదంబరం హామీని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోన్నట్లు కనిపిస్తుంది చూడబోతే..........
అంతేకాదండోయ్ తెలంగాణా ఇవ్వడం కుదరదు, ఇప్పుడు, ఎప్పటికీ.................. అని బలమైన సందేశాన్ని డైరేక్తుగాను, ఇండైరేక్తుగాను బల్లగుద్దిమరీ చెప్పేశారు.
తెలంగాణా వాదులు దీనికి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.............
 రాష్ట్రాన్ని ముక్కలు చేసేలాగైతే నేనూ నిరాహార దీక్ష చేస్తా నాకూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని..........................
అదేనండి మావూరిని కుడా ప్రత్యేక రాష్ట్రంగా గుర్త్ఘించాలని..............

ఇక ఆంద్రప్రదేశ్ ముక్కలైనట్లేనా?




ఇక ఆంద్రప్రదేశ్ ముక్కలైనట్లేనా?

Tuesday, December 8, 2009

నా హృదయం





 తోడు లేని నా  హ్రుదయాన్ని చిమ్మ చీకట్లు కమ్మివేసిన వేళ..............
.
.
.
.
.
.
.



................................కాలం గడిచింది.............................









నాకూ ఒక తోడు దొరికింది, మా ప్రేమ చీకట్లను తరిమికొడుతుంది........................

ఎవరిమాటా వినడు: ADURS SONGS

ఎవరిమాటా వినడు: ADURS SONGS

ADURS SONGS

అదుర్స్

అదుర్స్ పాటలు ఈ ర్యాపిడ్షేర్ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి 

Monday, December 7, 2009

ఎవరు?



నువ్వు నవ్వినా,
నువ్వు ఏడ్చినా,

నీ కష్టాల్లో,
నీ సుఖాలలో,

నీ బాధల్లో,
నీ సంతోషాల్లో,

కావాలోయ్ నీకొక  తోడు............
...................................................................
పంచుకున్నా,
తెంచుకున్నా,

తిట్టుకున్నా,
కొట్టుకున్నా,

కలిసున్నా,
విడిపోయినా,
..........................
............................
కావాలొక నేస్తం...............

కలకాలం తోడుండేది మనిషేనోయ్