Tuesday, December 15, 2009

చదువంటే ఇంత కష్టమా.............?

 
చదువంటే ఇంత కష్టమా.............?

ప్రతి దేశంలోనూ విద్యావ్యవస్థను నడిపించడానికి విద్యాశాఖ, ఆశాఖకు కొన్ని నిధులు వున్నాయి కాబట్టి మనదేశంలో కూడా వున్నాయి.
స్కూళ్ళు, టీచర్లు, సిలబస్, పుస్థకాలు ఉండాలి కాబట్టి అవి కూడా వున్నాయి................
కానీ అక్కడికీ మనకీ ఒక తేడా............
పాలకులు......................
ప్రజలకు నిజమైన విఙ్నానం   చేరువైతే నాయకులను తన్ని తగలేస్తారు..............
వాళ్ళు విఙ్నులు  కావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య...........
అది వాళ్ళకు సరైన మార్గంలో చేరకూడదు...........
.......................
నాసిరకం విద్యావిధానాలు, వసతులు లేని పాఠశాలలు,...............
> లెక్కలంటే అంకెలు, సూత్రాలు, కూడికలు, తీసివేతలు వగైరా..............
> సాంఘిక శాస్త్రం అంటే మన నాయకుల పూర్వీకుల గొప్పతనాన్ని పొగిడేందుకు ఉద్దేశించబడిన, అందరూ చదవాల్సిన శాస్త్రం..............
> సైన్సు అంటే ప్రపంచంలో అందరూ చదువుతున్న్నరు కాబట్టి మనమూ చదవాల్సిన అంశం..... బట్టీ పట్టాల్సిన శాస్త్రం..............
> భాషలు నేర్చుకోకపోతే పై శాస్త్రాలు చదవలేరు కాబట్టి నేర్చుకోవాలి...........
.............. విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం మాత్రం సహజంగా పిల్లలకుండే ప్రశ్నించే తత్వాన్ని, అవగాహనాసామర్ధ్యాన్ని, పరిశీలనా శక్తిని సమూలంగా చంపివేసి వాటిస్థానే బట్టీ పట్టడం, బుర్ర సక్రమంగా పని చేయకుండా ఒకదానికొకటి సంబంధంలేని చెత్త విషయాలతో నింపేయడం.
దీనికి తగ్గట్టుగానే సిలబస్ లు తయారు చేశారు, పరీక్షావిధానం సైతం తదనుగుణంగానే తయారుచేయడం జరిగింది, పుస్తకంలో వున్నది వున్నట్టుగానే పరీక్షలో రాశారా లేదా అని పరీక్షిస్తారు...........
............
కొద్దో గొప్పో స్థోమత ఉన్నవాళ్ళేకదా పిల్లల్ని చదివించేది,..................
ఆకలితో అలమటించేవాళ్ళు చాలామందే వున్నారు, వీళ్ళు తమపిల్లల్ని ఎలాగూ బడికి పంపలేరు, వీరిలో సహజసిద్దమైన ప్రశ్నించే తత్వం వగైరా లక్షణాలు ఆకలి మాటున పడి నలిగిపోతాయి..........
వీరు ఒకరిపై ఆధారపడటమే తప్ప తిరగబడలేరు, ప్రశ్నించలేరు.........
చివరాఖరుకు ప్రజల్ని గొర్రెల్ల్లాగా తయారుచేసి తమవెనక తిప్పుకుంటూ అధికారంలో తరాలకి తరాలు కొనసాగి అంతులేని సొమ్ముల్ని సంపాదించుకోడమే ప్రభువుల ధ్యేయం...........
గత 62 సంవత్సరాలుగా ఈ తరహా విధానాలను చాలా ప్రణాళికాబద్దంగా, జాగ్రత్తగా అమలు చేస్తూవస్తున్న ప్రభువులకు నిజంగా హ్యట్సాఫ్........
 

2 comments:

Rao S Lakkaraju said...

మీరు చెప్పింది అంతా నిజమే కాని సక్రమ పరిచేది ఏవిధంగా? నా ఉద్దేశం లో రోజుకి ఒక గంట చదువుకున్న వాళ్ళు పిల్లలకి చదువు చెప్పడానికి ఉపయోగిస్తే ప్రపంచం బాగుపడుతుందేమో.

phani kodali said...

antekadandi, pillalaki chaduvu kante mundu aalochinchadam, prasninchadam nerpali......