Friday, September 4, 2009

చరిత్రలో ఓ రక్తపు పుట

ఒక వ్యక్తి గొప్పతనం అతడిని కోల్పోయినపుడే తెలుస్తుందంటారు,
మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడోఒకప్పుడు సంభవించవలిసిందే కానీ అర్ధాంతరంగా ఒక వ్యక్తి 
తనువు చాలించినపుడు అతని ఆప్తులుకు, బంధు మిత్రులకు అది కలిగించే బాధ వర్ణనాతీతం.
ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం లోని ప్రజలు ప్రతిరోజూ తలుచుకునే వ్యక్తి, అందునా  వంటి వ్యక్తిని తలుచుకోనివారుండరంటే అతిశయోక్తి కాదేమో...............
ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఒక సంచలనమే............... మన రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సైతం మన ముఖ్యమంత్రిని తలుచుకోని రోజుండదేమో............
భౌతికంగా అతడు మరణించినా
అతని చేతలు, వ్యక్తిత్వం అతడికి ప్రజల గుండెల్లో చిరకాల స్థానాన్ని సంపాదించి పెట్టాయి.............
అతడి ఆశయాల రూపంలో అతడు ఎప్పటికీ బతికేవుంటాడు...............
  అలాంటి నిత్య సంచలనశీలిని అభిమానించేవారెందరో ఉన్నా, ద్వేషించేవారూ లేకపోలేదు, 
వారికి సైతం ఈయన మరణం ఏమాత్రం మింగుడు పడని విషయం,
ఎందుకంటే ఆయనపై వారికున్నది సైద్దాంతికపరమైన ద్వేషమే తప్ప వ్యక్టిగతమైనది కాదు,........
రేపటినుండి వారు ఎవరిని విమర్శించగలరు చెపండి?
ఐనా  లాంటి శాంతస్వరూపుడికి శత్రువులెవరుంటారు చెప్పండి.............
ఆయన మరణించిన రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దురద్రుష్టకరమైన రోజు................
మళ్ళీ మనకు అలాంటి నాయకుడు దొరకడు..............
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, ఇకపై కూడా వస్తారు, 
కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం దొరకడు గాక దొరకడు, 
ఇతడు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాడు................
 అతని సదాశయాలు నెరవేరాలని, అతడు రాష్ట్రప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలని, అతని ఆత్మకు శంతి చేకూరాలని ఆ భగవంతుడిని మరోసారి మనసారా ప్రార్ధిద్దాం....................
ఫొటోలు

3 comments:

Unknown said...

ఆయన బ్రతికున్నపుడు నేనూ విమర్శించేవాడిని................
ఇప్పుడనిపిస్తుంది ఎవరైనా బ్రతికున్నంతవరకే కదా అని.............., ఆయన పార్థివ దేహాన్ని సందర్శనకు ఎప్పుడు వుంచుతారా, ఆఖరిచూపు చూడాలని వుంది.............................

మాలా కుమార్ said...

aayana aatma ki santi kalugu kaaka

పరిమళం said...

ఆయనకు , ఆయనతోపాటూ చనిపోయిన వారికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా !