Thursday, September 3, 2009

ముఖ్యమంత్రి ఇక లేరు................



రాజకీయ ఉద్దండుడు, ముఖపై చిరునవ్వును చెరగనీయని శాంతస్వరూపుడు, తను తలిచిన పనిని ఎంత కష్టమైనా వెరవక పూర్తిచేసేవరకు నిద్రకూడా పోని సంకల్పబలుడు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు, తెలంగాణా, ఆంధ్రా, సీమ అంటూ నిత్యం భిన్న అభిప్రయాలు వ్యక్తంచేసే నాయకులను, సమైక్యత లేని  పార్టీని, ఏకతాటిపై నడిపించిన మేధావి, విభిన్న ఆలోచనలు, పథకాలతో పొరుగు రాష్త్రాలు, కేంద్రం మన్ననలను కూడా పొందిన మన ముఖ్యమంత్రి గత 22గంటలుగా కనిపించకపోవడం నిజంగానే బాధాకరమైన విషయం.
రాత్రి 9:00 గం. వరకు ఎంతమంది ఎన్ని విధాలుగా వెతికినా ఫలితం శూన్యం............
ఆతర్వాత కూడా గిరిజనులు, గ్రేహౌండ్స్ దళాలు, ప్రయత్నాలు కొనసాగించాయి, ఆధునిక మెటల్ డిటేక్టర్ల సాయం కూడా తీసుకుంటున్నారు, శాటిలైట్ చిత్రాలలో సైతం ఎటువంటి సమాచారం లభించలేదు. ఇస్రో, రక్షణ శాఖ తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి, అమెరికా ఆర్మీ సైతం ముందుకు వచ్చింది, ఐనా మిస్టరీ మాత్రం వీడలేదు, జూపల్లి క్రుష్నారావు వంటి మంత్రులు సైతం గాలింపుచర్యలు చేపట్టారు, ఈరోజు నల్లమల అడవులను శ్రీశైలానికి చెందిన జీవావరణ వేత్త తులసీరావు సాయంతో గాలించాలని నిర్ణయించారు, ఈరోజు గాలింపులను మరింత తీవ్రతరం చేయనున్నారు, ఎలాగైనా ముఖ్యమంత్రీఅచూకీ కనిపెడతారు, కానీ మనసెందుకో కీడు శంకిస్తుంది, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం శ్రీశైలం డ్యాం లో ఏదో పడినట్లు పెద్దశబ్దం వచ్చిందని, నీటిపై ఆయిల్ తేలుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారం మినహా మరే మాత్రం ఆచూకీకి సంబంధిన సమాచారం లేదు...............
ఆయన దుర్మరణం పాలయ్యారని తెలిసి రాష్ట్రప్రజల గుండెలు పగిలాయి.................
ఆయన ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవుడిని మనసారా  దేవుడిని ప్రార్ధిస్టూ.............

1 comments:

పరిమళం said...

రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా