Wednesday, September 30, 2009

ఫోను పట్టు, కోడు కొట్టు............... పని పట్టు


అన్నయ్యా ఫోను పట్టుకోగానే సరిపోలేదు, దానిగురించి కొంచెం తెలుసుకోవాలి...................
ఏమంటారు?
అందుకే................
నన్ను ఫాలో అయిపోండి...................

Sunday, September 6, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-7 (పోలీసోడు-2...............)


 

పోలీసులు లంచావతారాలే, ప్రజలని పీడిస్తారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, డబ్బున్నోళ్ళకే న్యాయం చేస్తారు..............
మరి వాళ్ళ ఆగడాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాం?
వాళ్ళ పై అధికారులు కూడా అలాగే ఉన్నారు కనుక........
పై అధికారుల పై అధికారులు కూడా అల్లగే ఉన్నారు.........
పోలిసోళ్ళంతా హోం మంత్రి చేతిలో కీలు బొమ్మలు మరి..........
మంత్రులు, నాయకులు, బడా వ్యాపారవేత్తలు,........... వీళ్ళంతా ఒక చెట్టు కాయలే కదా.................
వీళ్ళలో ఎవరేం చెప్పినా పొలీసోడు చేయాలి మరి, వీళ్ళ భద్రత, అవసరాలు ........ 
అన్నీ చుసుకోవలిసింది పోలీసోడే కదామరి..........
......................
కానిస్టేబుల్ మనలాంటివాళ్ళ దగ్గిర తీసుకునే లంచం అంతా అతని జేబులోకే వెళుతుందా?
లేదు..............
కానిస్టేబుల్ నెలకింత అని SI  కి, అతగాడు CI  కి, .................. 
ఇలా మంత్రివర్యుల జేబులవరకు ఒక చెయిన్ మాదిరిగా డబ్బు పంపిణీ జరుగుతుంది.............
......................................
.......................................
డబ్బున్నవాడికి అవససం వచినప్పుడు అతగాడి పని చేసిపెట్టకపోతే తనకు తెలిసిన నాయకుడితోనో, MLA తోనో, మంత్రి తోనో చెప్పిస్తాడు, అప్పుడు చచినట్టు అతడి పని చేసిపెట్టలి, అతగాడికే న్యాయం జరిగేలా చుడలి, లేకపోతే సదరు నాయకులవారు సస్పెండ్ చేయిస్తానని, మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానని.............. 
ఇలా పలు విధాలుగా బెదిరిస్తారు...........
నాయకుల అండ లెకుండా ఏ ఒక్క పోలీసూ మనలేడు అన్నది అక్షర సత్యం.............
.......................
పోలిసు శాఖ ఒక మంత్రి చేతులోనో, ఒక ప్రభుత్వంకిందో పనిచేసనంతకాలo
వాళ్ళకూ, ప్రజలకూ ఈ కష్టాలు తప్పవు..................
...........................
దీనికి ఒకటే పరిష్కారం..............
పోలిసు శాఖ ఒక స్వతంత్ర సంస్థగానో, హైకోర్టు కి అనుబంధ శాఖగానో అవతరించాలి.........
....................
కాదనగలరా?

Friday, September 4, 2009

చరిత్రలో ఓ రక్తపు పుట

ఒక వ్యక్తి గొప్పతనం అతడిని కోల్పోయినపుడే తెలుస్తుందంటారు,
మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడోఒకప్పుడు సంభవించవలిసిందే కానీ అర్ధాంతరంగా ఒక వ్యక్తి 
తనువు చాలించినపుడు అతని ఆప్తులుకు, బంధు మిత్రులకు అది కలిగించే బాధ వర్ణనాతీతం.
ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం లోని ప్రజలు ప్రతిరోజూ తలుచుకునే వ్యక్తి, అందునా  వంటి వ్యక్తిని తలుచుకోనివారుండరంటే అతిశయోక్తి కాదేమో...............
ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఒక సంచలనమే............... మన రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సైతం మన ముఖ్యమంత్రిని తలుచుకోని రోజుండదేమో............
భౌతికంగా అతడు మరణించినా
అతని చేతలు, వ్యక్తిత్వం అతడికి ప్రజల గుండెల్లో చిరకాల స్థానాన్ని సంపాదించి పెట్టాయి.............
అతడి ఆశయాల రూపంలో అతడు ఎప్పటికీ బతికేవుంటాడు...............
  అలాంటి నిత్య సంచలనశీలిని అభిమానించేవారెందరో ఉన్నా, ద్వేషించేవారూ లేకపోలేదు, 
వారికి సైతం ఈయన మరణం ఏమాత్రం మింగుడు పడని విషయం,
ఎందుకంటే ఆయనపై వారికున్నది సైద్దాంతికపరమైన ద్వేషమే తప్ప వ్యక్టిగతమైనది కాదు,........
రేపటినుండి వారు ఎవరిని విమర్శించగలరు చెపండి?
ఐనా  లాంటి శాంతస్వరూపుడికి శత్రువులెవరుంటారు చెప్పండి.............
ఆయన మరణించిన రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దురద్రుష్టకరమైన రోజు................
మళ్ళీ మనకు అలాంటి నాయకుడు దొరకడు..............
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, ఇకపై కూడా వస్తారు, 
కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం దొరకడు గాక దొరకడు, 
ఇతడు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాడు................
 అతని సదాశయాలు నెరవేరాలని, అతడు రాష్ట్రప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలని, అతని ఆత్మకు శంతి చేకూరాలని ఆ భగవంతుడిని మరోసారి మనసారా ప్రార్ధిద్దాం....................
ఫొటోలు

Thursday, September 3, 2009

ముఖ్యమంత్రి ఇక లేరు................



రాజకీయ ఉద్దండుడు, ముఖపై చిరునవ్వును చెరగనీయని శాంతస్వరూపుడు, తను తలిచిన పనిని ఎంత కష్టమైనా వెరవక పూర్తిచేసేవరకు నిద్రకూడా పోని సంకల్పబలుడు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు, తెలంగాణా, ఆంధ్రా, సీమ అంటూ నిత్యం భిన్న అభిప్రయాలు వ్యక్తంచేసే నాయకులను, సమైక్యత లేని  పార్టీని, ఏకతాటిపై నడిపించిన మేధావి, విభిన్న ఆలోచనలు, పథకాలతో పొరుగు రాష్త్రాలు, కేంద్రం మన్ననలను కూడా పొందిన మన ముఖ్యమంత్రి గత 22గంటలుగా కనిపించకపోవడం నిజంగానే బాధాకరమైన విషయం.
రాత్రి 9:00 గం. వరకు ఎంతమంది ఎన్ని విధాలుగా వెతికినా ఫలితం శూన్యం............
ఆతర్వాత కూడా గిరిజనులు, గ్రేహౌండ్స్ దళాలు, ప్రయత్నాలు కొనసాగించాయి, ఆధునిక మెటల్ డిటేక్టర్ల సాయం కూడా తీసుకుంటున్నారు, శాటిలైట్ చిత్రాలలో సైతం ఎటువంటి సమాచారం లభించలేదు. ఇస్రో, రక్షణ శాఖ తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి, అమెరికా ఆర్మీ సైతం ముందుకు వచ్చింది, ఐనా మిస్టరీ మాత్రం వీడలేదు, జూపల్లి క్రుష్నారావు వంటి మంత్రులు సైతం గాలింపుచర్యలు చేపట్టారు, ఈరోజు నల్లమల అడవులను శ్రీశైలానికి చెందిన జీవావరణ వేత్త తులసీరావు సాయంతో గాలించాలని నిర్ణయించారు, ఈరోజు గాలింపులను మరింత తీవ్రతరం చేయనున్నారు, ఎలాగైనా ముఖ్యమంత్రీఅచూకీ కనిపెడతారు, కానీ మనసెందుకో కీడు శంకిస్తుంది, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం శ్రీశైలం డ్యాం లో ఏదో పడినట్లు పెద్దశబ్దం వచ్చిందని, నీటిపై ఆయిల్ తేలుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారం మినహా మరే మాత్రం ఆచూకీకి సంబంధిన సమాచారం లేదు...............
ఆయన దుర్మరణం పాలయ్యారని తెలిసి రాష్ట్రప్రజల గుండెలు పగిలాయి.................
ఆయన ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవుడిని మనసారా  దేవుడిని ప్రార్ధిస్టూ.............

Wednesday, September 2, 2009

CM MISSING............

ముఖ్యమంత్రిగారు తప్పిపోయారట..................
హెలికాప్టర్ అత్యవసరంగా దింపేశారట............
ఆయన క్షేమమేనని సమాచారం.................
ఎంతవరకు నిజమో తెలీదు.................
ఉదయం 9:30 ముఖ్యమంత్రి తప్పిపోతే 2:00 కి మనకి తెలిసింది, మన సమాచార వ్యస్థ చూడండి ఎంత గొప్పగా వుందో...............
రోజ ఎంతపని చేశావమ్మా..............
కొందరు CM గారు చచ్చిపోయినట్లేనన తీర్మానించేశారు.............
పాపీ చిరాయు అన్నరు పెద్దలు...................
EmavutundO vechi chudali, repativaraku.............
ISRO, US army kuda rangasmloki digai............
if anybody found him please inform at idupulapaya or saakshi

ఆనందం పిచ్చోడిని -4 (డాన్.... )

అది ఒక ఫైన్ మార్నింగ్.............
మిస్టర్ డాన్.... గారు నిద్రలేచారు, తీరికగా పేపర్ చదువుతున్నారు...............
ఇంతలోనే ఫోన్ మోగింది...............
ఆ ఫోన్ వాళ్ళ సీక్రెట్ ఏజంట్ నుంచి................
.................
వెంటనే ఆలస్యం చేయకుండా రెడీ అయి ఒక ఏషియన్ పెయింట్స్ 5లీ క్యానుతో రోడ్డెక్కాడు మిస్టర్ డాన్....
కొంచెం దూరం నడిచాడో లేదో స్కూలుకెళుతున్న పిల్లలు కొందరు ఎదురయ్యారు,
(స్కూళ్ళకు వేళా పాళా ఉండట్లేదు కదా ఈమధ్య.............)
వాళ్ళు అతగాడినిచూసి నవ్వసాగారు...........
.
అతడిదేం పట్టించుకోకుండా ముందుకు సాగాడు
(అతడిలో ఒక కార్యసాధకుడిలో ఉండే ఫైర్ కనిపించింది)
ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంటిముందు ముగ్గులు వేసుకుంటున్న ఆడవాళ్ళు తనని చూసి మాడిపోయిన, 
అదోలా వున్న ముఖాలతో ఇళ్ళల్లోకి వెళ్ళిపోవడం గమనించాడు.........
ఇప్పుడు ఇతగాడు కొంచెం ఆలోచించి, తనలో ఏమీ లోపం లేదని భావించి ముందుకు సాగాడు...........
ఇప్పుడు మిస్టర్ డాన్...... మెయిన్ రోడ్డుకి వచ్చాడు, తన ప్రయాణాన్ని కొనసాగించాడు..........
ఇక్కడ పరిస్థితి కొంచెం తేడాగా అనిపించింది...........
ఓ రెండు మూడు వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి గుద్దుకొని చిన్నపాటి గందరగోళం ఏర్పడింది...........
కార్యసాధకుడు తనపనిని తప్ప ఇతరవిషయాలను మదిలోకి చేరనివ్వడు కదా..............
డాన్.... తన ప్రయాణాన్ని కొనసాగించాడు...........
.........
డాన్ తను చేరవలిసిన గమ్యం చేరుకున్నాడు.........
అక్కడ తనలాగే తెల్లని బూట్లు, లేత అకుపచ్చ రంగు టై, ఎర్రని కౌబాయి టోపీ ధరించివున్న వ్యక్తి దగ్గిరకి వెళ్ళి
" గోడ పిలిచింది" అంటాడు.........
ఉదయం ఫోన్ లో సీక్రెట్ ఏజెంట్ చెప్పిన కోడ్ అది, తనను కలవబోయే వ్యక్తి సమాధానం " ఏషియన్" అని చెప్పి తన చేతిలోని డబ్బా తీసుకోవాలి..............
అంతవరకూ బాగానే ఉంది.............
తరువాత......... ఆ వ్యక్తి ఆ రంగుని డాన్ తలపైనుండి గుమ్మరించి ఇలా చెప్పాడు
"ఇడియట్ బయటికి వచ్చేటపుడు బట్టలు వేసుకొని రావాలని తెలీదా?"
అప్పుడు తెలిసింది డాన్ కి తను బట్టలు వేసుకోలేదని................
(ప్రతిపక్షాలు విఫలం అయ్యాయి)

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-7 (పోలీసోడు...............)

పోలీసులంటే ఎవరు?
డబ్బున్నవారి గులాములు,
నాయకులకు జీతగాళ్ళు,
లంచావతారాలు,
సామాన్యుల పాలిటి రాక్షసులు,
అబద్దం తప్ప నిజం చెప్పని వాళ్ళు,
అన్యాయం తప్ప న్యాయం చేయని వాళ్ళు,
న్యాయాన్ని అధికారానికీ, డబ్బుకీ తాకట్టుపెట్టేవాళ్ళు,
డబ్బు తప్ప ఇంకేం అవసరం లేని, క్యారెక్టర్ లేని...................
....................
............................
...................................
పోలీసోడు కనబడితేనే లం.........., నుండి మొదలుపెట్టి మనకు వచ్చిన బూతులన్నీ తిడతాం.....................
........................
........................
పోలీసొళ్ళని చూసినంత చులకనగా ఇంకెవరినీ చూడం మనం..............

నిజంగానే పోలీసోళ్ళు అంత చెడ్డవాళ్ళా??????????
.............
వాళ్ళు అసలు మనుషులే కారా?
.
.
మరి ఎందుకు వాళ్ళంటే అంత చులకన మనకి?
........................
అవును మరి, ఏ సినిమాలో చూసినా అలాగే చూపిస్తారు, మన కళ్ళకి కూడా పోలిసోళ్ళు చేసేవి కనిపిస్తాయి కానీ వాళ్ళు అలా ఎందుకున్నారో ఆలోచించం...............
..........
ఒక్కసారి ఆలోచిద్దాం............. వాళ్ళు అలా ఎందుకున్నారో, వాళ్ళ సమస్యలేంటొ, అసలు మనం ఎందుకు వాళ్ళను గురించి ఆలోచించాలో...............................

Tuesday, September 1, 2009

ఆనందం పిచ్చోడిని -4



నేను  విన్న అతిపెద్ద జోకులు:
1) వర్షాలు బాగా కురవాలంటే  మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
                                                    -ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి

2) రాష్త్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంది, ఆర్ధికమాంద్య ప్రభావం మనరాష్ట్రంపై పెద్దగా లేదు.
                                                           -ఎన్నికలకు ముందు ఆర్ధిక మంత్రి
   ఆర్ధికమాంద్యం ప్రభావం మన రాష్ట్రంపై తీవ్రంగా ఉంది, బడ్జెట్ కూడా సమకూరడంలేదు.
(బడ్జెట్ సమావేశాలకు ముందు, ఎన్నికలకు తర్వాత)

3) డెంగ్యూ కూడా మామూలు జ్వరమే, దేవుడు కరుణిస్తాడు, త్వరలోనే తగ్గిపోతాయి.
                                                           -ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి.

4) ప్రాజెక్టులు మట్టితో కడితే వరదలు వచ్చినపుడు కూలగొట్టవచ్చు.
                                          -ముఖ్యమంత్రి.

5) మా కుటుంబంలోనివారు అధికారంలో వుండివుంటే బాబ్రీ కూలిపోయివుండేదికాదు.
                                                                           -రాహుల్ గాంధీ.

6) ప్రతిపక్షాలు విఫలం అయ్యాయి.
                       -ముఖ్యమంత్రి.

7) రాశ్ట్రంలో ప్రజలు పండగ చేసుకుంటున్నారు.
                                           -జగన్.

8) 200 తో కుటుంబానికి నెలకు సరిపడా భత్యం అందిస్తున్న ప్రభుత్వం.
                                                                 -సాక్షి.