Wednesday, September 30, 2009

ఫోను పట్టు, కోడు కొట్టు............... పని పట్టు


అన్నయ్యా ఫోను పట్టుకోగానే సరిపోలేదు, దానిగురించి కొంచెం తెలుసుకోవాలి...................
ఏమంటారు?
అందుకే................
నన్ను ఫాలో అయిపోండి...................

Sunday, September 6, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-7 (పోలీసోడు-2...............)


 

పోలీసులు లంచావతారాలే, ప్రజలని పీడిస్తారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, డబ్బున్నోళ్ళకే న్యాయం చేస్తారు..............
మరి వాళ్ళ ఆగడాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాం?
వాళ్ళ పై అధికారులు కూడా అలాగే ఉన్నారు కనుక........
పై అధికారుల పై అధికారులు కూడా అల్లగే ఉన్నారు.........
పోలిసోళ్ళంతా హోం మంత్రి చేతిలో కీలు బొమ్మలు మరి..........
మంత్రులు, నాయకులు, బడా వ్యాపారవేత్తలు,........... వీళ్ళంతా ఒక చెట్టు కాయలే కదా.................
వీళ్ళలో ఎవరేం చెప్పినా పొలీసోడు చేయాలి మరి, వీళ్ళ భద్రత, అవసరాలు ........ 
అన్నీ చుసుకోవలిసింది పోలీసోడే కదామరి..........
......................
కానిస్టేబుల్ మనలాంటివాళ్ళ దగ్గిర తీసుకునే లంచం అంతా అతని జేబులోకే వెళుతుందా?
లేదు..............
కానిస్టేబుల్ నెలకింత అని SI  కి, అతగాడు CI  కి, .................. 
ఇలా మంత్రివర్యుల జేబులవరకు ఒక చెయిన్ మాదిరిగా డబ్బు పంపిణీ జరుగుతుంది.............
......................................
.......................................
డబ్బున్నవాడికి అవససం వచినప్పుడు అతగాడి పని చేసిపెట్టకపోతే తనకు తెలిసిన నాయకుడితోనో, MLA తోనో, మంత్రి తోనో చెప్పిస్తాడు, అప్పుడు చచినట్టు అతడి పని చేసిపెట్టలి, అతగాడికే న్యాయం జరిగేలా చుడలి, లేకపోతే సదరు నాయకులవారు సస్పెండ్ చేయిస్తానని, మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానని.............. 
ఇలా పలు విధాలుగా బెదిరిస్తారు...........
నాయకుల అండ లెకుండా ఏ ఒక్క పోలీసూ మనలేడు అన్నది అక్షర సత్యం.............
.......................
పోలిసు శాఖ ఒక మంత్రి చేతులోనో, ఒక ప్రభుత్వంకిందో పనిచేసనంతకాలo
వాళ్ళకూ, ప్రజలకూ ఈ కష్టాలు తప్పవు..................
...........................
దీనికి ఒకటే పరిష్కారం..............
పోలిసు శాఖ ఒక స్వతంత్ర సంస్థగానో, హైకోర్టు కి అనుబంధ శాఖగానో అవతరించాలి.........
....................
కాదనగలరా?

Friday, September 4, 2009

చరిత్రలో ఓ రక్తపు పుట

ఒక వ్యక్తి గొప్పతనం అతడిని కోల్పోయినపుడే తెలుస్తుందంటారు,
మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడోఒకప్పుడు సంభవించవలిసిందే కానీ అర్ధాంతరంగా ఒక వ్యక్తి 
తనువు చాలించినపుడు అతని ఆప్తులుకు, బంధు మిత్రులకు అది కలిగించే బాధ వర్ణనాతీతం.
ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం లోని ప్రజలు ప్రతిరోజూ తలుచుకునే వ్యక్తి, అందునా  వంటి వ్యక్తిని తలుచుకోనివారుండరంటే అతిశయోక్తి కాదేమో...............
ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఒక సంచలనమే............... మన రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సైతం మన ముఖ్యమంత్రిని తలుచుకోని రోజుండదేమో............
భౌతికంగా అతడు మరణించినా
అతని చేతలు, వ్యక్తిత్వం అతడికి ప్రజల గుండెల్లో చిరకాల స్థానాన్ని సంపాదించి పెట్టాయి.............
అతడి ఆశయాల రూపంలో అతడు ఎప్పటికీ బతికేవుంటాడు...............
  అలాంటి నిత్య సంచలనశీలిని అభిమానించేవారెందరో ఉన్నా, ద్వేషించేవారూ లేకపోలేదు, 
వారికి సైతం ఈయన మరణం ఏమాత్రం మింగుడు పడని విషయం,
ఎందుకంటే ఆయనపై వారికున్నది సైద్దాంతికపరమైన ద్వేషమే తప్ప వ్యక్టిగతమైనది కాదు,........
రేపటినుండి వారు ఎవరిని విమర్శించగలరు చెపండి?
ఐనా  లాంటి శాంతస్వరూపుడికి శత్రువులెవరుంటారు చెప్పండి.............
ఆయన మరణించిన రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దురద్రుష్టకరమైన రోజు................
మళ్ళీ మనకు అలాంటి నాయకుడు దొరకడు..............
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, ఇకపై కూడా వస్తారు, 
కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం దొరకడు గాక దొరకడు, 
ఇతడు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాడు................
 అతని సదాశయాలు నెరవేరాలని, అతడు రాష్ట్రప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలని, అతని ఆత్మకు శంతి చేకూరాలని ఆ భగవంతుడిని మరోసారి మనసారా ప్రార్ధిద్దాం....................
ఫొటోలు