Friday, August 28, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-4(ఆక్షరాస్యత )



మన దేశంలోని చిన్నారులందరి ముఖాలలో ఇలాంటి చిరునవ్వులు ఎప్పుడు చూస్తామో...............


మన చదువులు ఎలా వున్నాయి?
.
.
గవర్నమెంటు స్కూలు:
గవర్నమెంటు టీచర్లు......... వీళ్ళు పిల్లలకు చదువులు స్కూల్లో చెప్పరు, సాయంత్రం ఇంటిదగ్గిర చెప్తారు.... ట్యూషన్లో......
అలా ఐతే ట్యూషన్ ఫీ కూడా వస్తుంది కదా మరి.....
కొందరు ప్రబుద్దులు అది కూడా చేయరనేది వేరే విషయం..........
నిజాయితీగా పనిచేసేవాళ్లను వేళ్ళపై లెక్కపెట్టవచు.........
ఒకవేళ వీళ్ళు చెప్దాం అన్న వేళ్ళకు ఏమీ రాదు అనేది వేరే విషయం........
ఎందుకంటే వీళ్ళుకూడా ఇలాంటి వాతావరణాం నుండి వచ్చినవాళ్ళే కదా........
గవర్నమెంటు జీతం ఇచ్చేది ఇన్నిసంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించినందుకని వీళ్ళ బలమైన నమ్మకం..........
ఇక స్కూలు విషయానికి వస్తే......... నాలుగు గదులు, చెక్క బెంచీలు, బ్లాకు బోర్డు............
చాలా ఊళ్ళల్లో ఆవులు, గేదెలు, మేకలు కూడా ఇక్కడే వుంటాయి...................
.
.
.
.
మరి ప్రైవేటు స్కూళ్ళో.......... ఇవి చాలా......... బాగున్నాయి అని అనుకుంటే పప్పులో, సాంబారులో, చికెన్లో...... కాలేసినట్లే...........
వీటి నిజస్వరూపం ఏంటో రేపు చూద్దాం..............
అప్పటివరకూ మనదేశం బాగుపడిపోయినట్లు కలలు కంటూ గడిపేద్దాం...............

Thursday, August 27, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-3


అభివ్రుద్దికి తొలి మెట్టు అక్షరాస్యత.
అక్షరాస్యులైన్ ప్రజలుంటే ఏదైనా సాధించొచ్చు.............(సాధించాలనుకొంటే........మన నాయకులు అనుకోరనేది వేరే విషయం అనుకోండి.......)
ఎన్నో దేశాలు ఈ నిజాన్ని ఋజువుచేశాయి కూడా.............
.
.
.
.
అసలు వీడికేం పనిలేదా.............., చదువు, అభివ్రుద్ది అంటాడు,............. పెరుగుతున్న ధరలు, బాబు, ముఖ్యమంత్రి, చిరంజీవి, సినిమా,................ లాంటివాటిపై రాయొచ్చు కదా..........
.
.
.
.

అసలు దేశం ఎందుకు బాగుపడాలి?
మనం బాగానే వున్నాం కదా..............
మన పిల్లల్ని చదివించుకుంటున్నాం కదా........
ధరలు ఇవ్వాళ కాకపోతే రేపు తగ్గుతాయి.........
.
.
.
కానీ అఫీసుకు వెళ్దామని రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ జాం, నిలకడ లేని ప్రభుత్వాలు, రోజుకో కుంభకోణం, చిన్నపిల్లల అత్మహత్యలు........., ఉగ్రవాదుల దాడులు, రైతులు పండించిన పంటకు లేని ధరలు, వాటి ఉత్పత్తుల(ప్రాసెస్డ్ ఫుడ్) ధరలు మాత్రం ఆకాశంలో...........
విదేశాలకు దొంగ ఎగుమతులు............
రోగం వస్తే వైద్యం చేయించుకోలేని మధ్యతరగతి ప్రజలు, 24 గంటలూ కరంటు ఇవ్వలేని ప్రభుత్వాలు..........
ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి?
.
.
జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మళ్ళీ 18-19వ శతాబ్దాల నాటి బ్రిటీషు వారి పాలనకు ఏమాత్రం తీదిపోని సామ్రాజ్యవాదుల చేతిలో వున్నాం అనిపిస్తుంది,..................
తేడా ఒక్కటే, బ్రిటీషు వారు విదేశీ పాలకులు, ఇప్పటి పాలకులు స్వదేశీయులు......................
కానీ ఇరువురి ఆశయం మాత్రం ఒక్కటే....................
.
.
.
బ్రిటీషువారు గుమాస్తాలను తయారు చేసే చదువులను మనకు నేర్పించారని వారిని విమర్శించే మన నాయకులు ఇప్పటి విద్యావిధానంపై నోరు విప్పరేం?
అంతకంటే అధ్వాన్నంగా వున్నాయి మన చదువులు..........
10వ తరగతి పాసైనవాడికి కనీసం కూడికలు, తీఎసివేతలు కూడా రాని పరిస్థితి...........
కేవలం 5 నుండి 10 శాతం మంది పిల్లల చదువులు మాత్రమే సంత్రుప్తికరంగా ఉన్నాయి(ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా)......................
.
.
ఎంతపెద్ద నేరం చేసినా శిక్ష పడకుండా దర్జాగా బయట తిరగొచ్చనేది చిన్నపిల్లాడికి సైతం తెలిసిన నిజం, న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినవాడి జీవితం సగం పూర్తైనా అతగాడికి న్యాయం మాత్రం జరగదు...................
.
.
మరి వీటికి పరిష్కారం లేదా?
మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం మనం ఏంచేయాలి?
...........
..................
.............................

Wednesday, August 26, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-2 (అక్షరాస్యత అంటే.................?)



అక్షరాస్యత అంటే.................?
ఒక వ్యక్తికి సంతకం చేయడం వస్తే అతను అక్షరాస్యుడేనా?
.
.
ఆ సంతకం ఎందుకు ఉపయోగపడుతుంది?
.
.
.
బ్యాంకులో డబులు డ్రా చేయడానికా?
పంట ఋణం తేసుకోడానికా?
జమీందారు దగ్గిర హాజరు వేసుకోడానికా?
రైతు తన జీవితాన్ని వడ్డీవ్యాపారి దగ్గిర తాకట్టు పెట్టాడానికా?
మండలాఫీసులో ఎవరో రాసిన ఆర్జీపై సంతకం చేయడానికా?
పట్నంలో చదువుతున్న తన పిల్లలకు డబ్బు పంపే మనీయార్డరు పై సంతకం చేయడానికా?
.
.
.
.
వీటన్నిటికీ వేలిముద్ర సరిపోతుందే.................?
మరి సంతకం ఎందుకు?
................................
సంతకం వచ్చిన ప్రతివాడూ అక్షరాస్యుడేనా?
.
.
అవును.............!
మన జనాభాలెక్కల ప్రకారం...........
.....
............
...................
మన నాయకులు మనల్ని మభ్యపెట్టడానికి చూపించే కాకిలెక్కల్లొ ఇదీ ఒక స్టంటే !
........
మరి సిసలైన అక్షరాస్యత అంటే ఏది?
ఒక ఎరువుల బస్తాపైనో, ఒక యంత్రంపైనో ముద్రించివున్న సూచనలు, సమాచారం చదివి అర్ధం చేసుకొగలిగినపుడు ...........
ఒక కోర్టు, పంచాయితీ నోటేసు చదవగలిగినపుదు,
ఒక ఆఫీసుకు వెల్లి సొంతంగా ఒక అర్జీ రాసి ఇవ్వగలిగినపుడు,
తను బ్యాంకులో తేసుకున్న ఋణంపై, జమచేసిన డబ్బుపై వడ్డీని లెక్కకట్టుకోగలిగినప్పుడు,
వడ్దీవ్యాపారి దగ్గిర మోసపోకుండా తనను తాను కాపాడుకోగలిగినపుడు,
స్కూలునుండి ఇంటికి వచ్చిన పిల్లలతో హోంవర్కు చేయించగలిగినపుదు,
.
.
.
.
ఒక వ్యక్తిని అక్షరాస్యుడిగా గుర్తించవచ్చు.
.
.
.ఇదీ అక్షరాస్యత అంటే.......... దీనినే నిర్వాహక అక్షరాస్యత అనికూడా అంటారు.....
మనదేసంలో ఇటువంటి అక్షరాస్యులు ఏంతమంది వున్నారు?
??????????????????
60%....?
50%.........?
40%.............?
30%....................?
20%...........................?
15%...................................?
ఇదీ మన అక్షరాస్యుల సంఖ్య................
.
.
.
ఇప్పుడు చెప్పండి మనం బడా నాయకులు, దళారీల చేతిలో మోసపోకుండా ఎలావుండగలం?